తన ధ్యాసలో పడటం కూడా ప్రేమే



                              ప్రేమంటే గంటలు గంటలు
ఫోన్లో మాట్లాడుకోవటాలు,
కాఫీ షాపుల్లో కాలక్షేపాలు
చేయటమే కాదు
నీ ధ్యాస మరచి
తన ధ్యాసలో పడటం కూడా ప్రేమే..!!
-నందు




విలువ తెలియని వాళ్ళకోసం !!




నీ జ్ఞాపకాలు

నీ జ్ఞాపకాలు కూడా ఈ అలల్లాగే
ఒకచోట కుదురుగా ఉండవు,
మనసుని కుదుటపడనీయవు..!!
నందు 

సముద్రమంత ప్రేముంటే సరిపోదు

నీలో సముద్రమంత ప్రేముంటే సరిపోదు...
ఆ ప్రేమని అర్థం చేసుకోవటానికి 
అవతలి వాళ్ళకి 
ఆకాశమంతా మనసుండాలి..!!

-నందు

సముద్రమంత ప్రేమ

అమ్మానాన్నలతో-మనం


రోజు మనతోనే ఉండే మన అమ్మానాన్నలతో  
కాసేపు సరదాగా మాట్లాడటానికి సమయం ఉండదు మనకి,
కాని మదర్స్ డే, ఫాదర్స్ డే లకి మాత్రం పేస్బుక్లో పోస్ట్లు
వాట్సాప్లో స్టేటస్లు పెట్టి వాళ్ళ మీద ప్రేమని చూపిస్తూ మురుసిపోతుంటావ్....!

నిన్నెక్కడో ఎక్కడో  ఊరికి దూరంగా పట్నంలో
 పైచదువులకి పంపినిన్నో ప్రయోజకుడ్ని చేసాక
నువ్వేమో దారిలో పడతావు
వాళ్లు మాత్రం అక్కడే అదే ఊర్లో నిన్ను 
ప్రయోజకుడ్ని చేయటానికి చేసిన అప్పుల్ని తీర్చుతూ మగ్గుతుంటారు..!!

స్వతంత్ర జీవితానికి అలవాటు పడి, వాళ్ళతో మాట్లాడటానికి కూడా తీరిక ఉండదు నీకు,
అయిన వాళ్ళ మీద  ప్రేమున్నట్లు మిస్సింగ్ యు అని మాత్రం పోస్ట్లు పెడతావ్....!!!

నీకో వయసొచ్చాక, వయసుకి ఒక తోడయ్యాక అమ్మానాన్నలు అస్సలు గుర్తురారు
 అత్యవసరానికో లేక పండగకి రమ్మని పిలుపోస్తే ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ఉండి పోతావ్

నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి శుభాకాంక్షలు చెప్పటం అంటే వాళ్ళకి
జీవితాంతం వాళ్ళకి సేవచేయటం
కాని స్వతంత్ర భావాలకి అలవాటు పడి
మనకెందుకులే అనుకుని బ్రతుకుతున్న మనలాంటి వాళ్ళకి ఇదెప్పుడు బోధపడదు.


-నందు
18-Jun-2017

గతమెప్పుడు గమ్మత్తుగా



గతమెప్పుడు గమ్మత్తుగా ఉంటుంది 
నువ్ ప్రస్తుతాన్ని ఆస్వాదిస్తే....
అదే గతం ఇంకా బాధని కలిగిస్తుంది 
నువ్వింకా దాని గురించే ఆలోచిస్తుంటే...
-నందు.


యుద్ధం -ఆట


ఆటలో గాని 
యుద్దంలో గాని 
నువ్వు ఓడిపోయావంటే 
నువ్వు బలహీనుడవని కాదు
ఎదుటివాడు నీకంటే బలవంతుడని అర్థం
-నందు

బాధ కూడా బాగానే ఉంటుంది



మనం ప్రేమించిన వ్యక్తి మనకి దూరం అయినపుడో/ మోసం చేసినపుడో భరించలేనంత బాధ.
పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, ఫస్టు ర్యాంకు రాలేదనో బాధ.
వెళ్లిన ప్రతిసారి ఉద్యోగం దక్కకపోతే,
చచ్చిపోవాలి అనిపించేంత బాధ.
నమ్మిన వాళ్లు మోసం చేసినపుడు,
అయినవాళ్ళందరూ దూరమైనపుడు,
బ్రతకకూడదు అనిపించేంత బాధ.
ఎంతో ప్రేమతో పెంచుకున్న మొక్కో, కుక్కో,
ఇష్టపడి కొనుక్కున్న వస్తువు పోతేనో, పాడైపోతేనో బాధ.
అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో బాధ...
నిజమే
ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి
చాలా మందిమి బాధ దగ్గరే ఆగిపోతున్నాం.
అందుకే వ్యక్తి మీద కక్ష కట్టెస్తున్నాం,
జీవితం మీద విరక్తి చెందుతున్నాం, 
అందుకే చిన్న చిన్న వాటికి
అసలీ బ్రతుకే వద్దనుకుంటున్నాం..

కాని ఎర్రటి ఎండాకాలం తర్వాత వర్షాకాలం వచ్చి మనుషుల్ని(మనసుల్ని) స్పృశింప చేసినట్లు
శిశిర ఋతువు వచ్చి చెట్ల ఆకుల్ని రాల్చితే,
ఆ వెంటనే వచ్చే వసంత ఋతువు అవే చెట్లను మళ్ళి చిగురింపజేసినట్లు...

మనిషి జీవితంలో కూడా బాధ తర్వాత ఆనందం ఉంటుంది.
కాని ఆ ఆనందాన్ని పొందటానికి బాధల్ని అధిగమించలేకపోతున్నాం.
మనలో ఆ బాధని అధిగమించే శక్తి ఉంటే
అవును నిజంగా బాధ కూడా హాయిగానే ఉంటుంది

-నందు
© #anandgoudpedduri
Sunday, October 09, 2016 - , , , , , 0 comments

హైదరాబాద్లో రోడ్లు- హైద్రాబాద్లో వానలు...!!


ఎవరు చేసిన పాపమో, హైదరాబాద్లో ఉండే వారి అదృష్టమో తెలియదు గాని
కొన్ని సంవత్సరాలుగా సరిగా వర్షాలు లేవు పోయిన నెల దాక కూడా.
గత రెండు మూడు వర్షాలు గట్టిగా పడే సరికి
హైదరాబాద్లో రోడ్డు నాశనం కావటానికి వర్షమే కారణం అని
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళం అని చెప్పుకునే మనుషులు
ఇంకెన్నాళ్ళు మీరు చేసే తప్పుల్ని వేరోకరిమీద తోయటం ?
గత కొన్నేళ్ళుగా రోడ్డు మరమత్తు అంటే గుంటలు ఉన్నచోట పైపైన డాంబర్(తారు) వేయటం.,
రోడ్డు వేయటం అంటే ఉన్న రోడ్డు మీద మళ్ళి ఇంకో పొరలాగా రోడ్డు వేయటం తప్పిస్తే
ఏ ఒక్కసారైనా ఉన్న పాత రోడ్డుని తవ్వేసి మళ్ళి కొత్తగా రోడ్డు వేయటం జరుగుతుందా ?
ఇది మా తప్పు కాదు గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగింది అంటారు
సరే దాన్ని ఒప్పుకుందాం, మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఎం చేస్తోంది ??
మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ పరిక్షకి జాగ్రత్త తీసుకుంటాం
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్ష రాస్తే ప్రతిసారి ఫెయిల్ అవ్వటమే జరుగుతుంది..
ఇంకెన్ని సంవత్సరాలు సాకులతోనే సరిపెడతారు ?
మెట్రో రైలని, అదని, ఇదని.
మెట్రో రైలు పని జరిగని చాల చోట్ల ఇదే పరిస్థితి
వర్షం వస్తే రోడ్డు మీద ఉన్నది చిన్న గుంతనో, మ్యాన్ హోలో అని
జనాలు భయభయంగా అడుగేస్తున్నారు ?
వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళు నిలుస్తున్నాయి
కరెక్టే కానీ నీళ్ళేందుకు నిలుస్తున్నాయి ?
దానికి గల కారణాలేవి,
సరిదిద్దే మార్గం ఏది అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుందా ?
నాలాలను సరిదిద్ది, డ్రైనేజి వ్యవస్థని పునరుద్ధరణ చ్గేయాలి కదా ?
ఇది రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు
పోయిన సంవత్సరం వర్షాకాలం అయిపోయిన తరువాత
మరమత్తులు చేయటం మొదలు పెట్టిన కనీసం కొంచెమైనా తేడా ఉండేది..
చేతగాని గాని ప్రభుత్వం, చేతగాని వ్యవస్థ, ఇదేనా మీరంటున్న బంగారు తెలంగాణ ??
ఇది కాదు ప్రజలు కోరుకున్నది ,మార్పు..
మార్పంటే అయిదేళ్ళకోకసారి ప్రభుత్వాల మార్పు కాదు.
ప్రభుత్వ విధానాల్లో మార్పు, మీ ఆలోచనల్లో మార్పు.
పాలించే ప్రభువులారా ,
అందకారంలో ఉన్న అధికారులారా ?
మొద్దు నిద్రను వీడండి
మీరు అంటున్న బంగారు తెలంగాణలో రోడ్డ్లు బీటలు వారిపోయాయి.
కళ్ళు తెరిచి చూడండి.
ప్రశ్నించే వాడ్ని ప్రతిపక్షం అంటే నేనేమి చేయలేని
కాని సగటు హైదరాబాదీ ఆవేదన ఇది.
-నందు

యుద్ధం- ఉద్యమం

ఉద్యమం ఒక ఆశయ సాధన కోసం చేసేది.

యుద్ధం ఒకరిపై ఆధిపత్యం కోసం చేసేది.
అందుకే స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం అన్నారు 
కానీ తెలంగాణ యుద్ధం,స్వాతంత్ర యుద్ధం అనలేదు...


ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలనేది మా ఉద్యమం...
డియర్ పాకిస్తాన్,
                                నీవెటు వైపో తేల్చుకో..!
నీ భవితవ్యం నిర్ణహించుకో..!!
-నందు