రోజు మనతోనే ఉండే మన అమ్మానాన్నలతో
కాసేపు సరదాగా మాట్లాడటానికి సమయం ఉండదు మనకి,
కాని మదర్స్ డే, ఫాదర్స్ డే లకి మాత్రం పేస్బుక్లో పోస్ట్లు,
వాట్సాప్లో స్టేటస్లు పెట్టి వాళ్ళ మీద ప్రేమని చూపిస్తూ మురుసిపోతుంటావ్....!
నిన్నెక్కడో ఎక్కడో ఊరికి దూరంగా పట్నంలో
పైచదువులకి పంపి, నిన్నో ప్రయోజకుడ్ని చేసాక
నువ్వేమో దారిలో పడతావు,
వాళ్లు మాత్రం అక్కడే అదే ఊర్లో నిన్ను
ప్రయోజకుడ్ని చేయటానికి చేసిన అప్పుల్ని తీర్చుతూ మగ్గుతుంటారు..!!
స్వతంత్ర జీవితానికి అలవాటు పడి, వాళ్ళతో మాట్లాడటానికి కూడా తీరిక ఉండదు నీకు,
అయిన వాళ్ళ మీద ప్రేమున్నట్లు మిస్సింగ్ యు అని మాత్రం పోస్ట్లు పెడతావ్....!!!
నీకో వయసొచ్చాక, ఆ వయసుకి ఒక తోడయ్యాక అమ్మానాన్నలు అస్సలు గుర్తురారు
ఏ అత్యవసరానికో లేక పండగకి రమ్మని పిలుపోస్తే ఎలా స్పందించాలో తెలియని స్థితిలో ఉండి పోతావ్
నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి శుభాకాంక్షలు చెప్పటం అంటే వాళ్ళకి
జీవితాంతం వాళ్ళకి సేవచేయటం
కాని స్వతంత్ర భావాలకి అలవాటు పడి,
మనకెందుకులే అనుకుని బ్రతుకుతున్న మనలాంటి వాళ్ళకి ఇదెప్పుడు బోధపడదు.
-నందు
18-Jun-2017