నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది

నువ్వెలా ఉంటావో తెలియదు,
కాని చూడాలనిపిస్తోంది.
నువ్వెక్కడుంటావో తెలీదు,
కాని నిన్ను కలవాలనిపిస్తోంది.
నీ స్వరమెలా ఉంటుందో తెలియదు,
కాని నువ్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. 
ఎం చేస్తుంటావో తెలియదు,
కానీ నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. 
నీ మనసులో నేనుంటానో  లేదో తెలియదు
కాని నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది...
                                             -నందు 

కొన్ని అంతే...!!!

అవసరంతో చేసే స్నేహాలు
వ్యామోహంలో పడే ప్రేమలు
ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు
కోపంలో తీసుకునే నిర్ణయాలు
ఎక్కువ రోజులు నిలబడవు...
-నందు


సుఖసంతోషాలు


పుట్టినప్పటి నుండే సుఖాలకి అలవాటు పడిన 
ఈ జనరేషన్ పిల్లలకి ఎలా సుఖపడాలో తెలుసు, 
కానీ సంతోషం అంటే ఏమిటో ఇప్పటికీ 
చాలా వరకి చాలా మందికి అర్థం కాదు... 
కానీ దురదృష్టం ఏంటంటే 
తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం 
చేసుకుంటే అమ్మాయి/అబ్బాయి 
జీవితంలో సుఖపడతారని ఆలోచిస్తున్నారే తప్ప 
జీవితాంతం సంతోషంగా ఉండగలరా అని 
ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు..
సుఖానికి సంతోషానికి చాలా తేడా ఉందిరాబ్బయ్...

-నందు
03/03/2016

కాదేది కవితకు అన్హరం..!!


బండికి గీతలు,

మొహానికి ముడతలు...!!

సముద్రంలో నీళ్ళు,

మనిషి కంట్లో కన్నీళ్ళు...!!

కామన్ అయిపోయాయ్

-నందు

ప్రేమ



ప్రేమ:
ప్రే అంటే ప్రేమించటం,
మ అంటే మర్చిపోవటం కాదు...  

ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మర్చిపోలేనంతగా ప్రేమించటం..!!
ప్రేమ అంటే ప్రేమించటం
మ అంటే మనం ఇంకొకరిని ప్రేమించలేనంతగా ప్రేమించటం..!!!
-నందు

నేనోడిపోయా...!!!

నేనోడిపోయా,
నిన్ను గెలవటంలో..!
నన్ను నీలో వెతకటంలో..!!
గెలుస్తాననే నమ్మకం నాలో ఉంది..!
కానీ గెలుస్తానో లేదో నీ చేతిలో ఉంది..!!
-నందు

గుర్తుకురావటం-మర్చిపోకపోవటం

గుర్తుకురావటం వేరు,
మర్చిపోకపోవటం వేరు..
రెండింటికి చాల తేడా ఉంది,
చదవటంలో కాదు ఆలోచించటంలో...
-నందు
Tuesday, January 12, 2016 - 1 comments

గతాలు-జ్ఞాపకాలు


మర్చిపోయేవన్ని గతాలు కావు
గుర్తున్నవన్ని జ్ఞాపకాలు కావు
మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు
గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినా 
గుర్తుకురానివే గతాలు..!!!
-నందు



స్వీకరించే విధానం


ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు 
తన తప్పులు కూడా ఒప్పుగానే కనిపిస్తాయి...
కాని, అదే మనిషిని ద్వేషించటమో లేక 
దూరం చేయటమో మొదలు పెడితే 
తన ఒప్పులు కూడా ఒక్కోసారి తప్పుగానే కనిపిస్తాయి...
ఉన్న మంచితనం కాస్త మరుగున పడిపోతుంది
తేడా తనలో లేదు. 

మనం, తనని స్వీకరించే విధానంలో ఉంది...!!!

                                 - నందు


ప్రేమించటం అంటే

ప్రేమించటం అంటే నిన్నే కాదు,
 నీ జ్ఞాపకాల్ని  కూడా...!
జీవించటం అంటే నీతోనే కాదు 
నీ జ్ఞాపకాలతో(జ్ఞాపకాల్లో) కూడా...!!
-నందు