Sunday, January 19, 2014 - , , , , 1 comments

అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా...!!!

నా చిన్నపుడు నీతో ఎలా ఉన్నానో గుర్తులేదు,
కొంచెం తెలివొచ్చాక ఎక్కువ నానమ్మ
దగ్గరే ఉంటానని మారం చేసే వాడ్ని ...
నాకు తెలుసు నేను బాగా అల్లరి చేసే వాడ్ని,
బాగా మారం చేసే వాడ్ని... 
కోరుకున్నది దక్కే దాక మొండి పట్టు విడిచే వాడ్ని కాదు... 
నా మూలాన ఎన్ని సార్లు బాధ పడ్డావో,
అయిన అన్నింటిని భరించావ్ ...
ఊహ తెలిసినప్పటి నుండి నువ్వెప్పుడు హాస్పిటల్స్ చుట్టే తిరిగెదానివి...  
నాకు తెలివొచ్చె సరికి నువ్వేమో తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయావు ...

ఇపుడేమో అందరంటున్నారు  నేను చిన్నప్పటిలా లేనని 
నువ్వు చనిపోయాక నాలో మొండితనం తగ్గిందని, 
చాలా మార్పోచ్చిందని...   
ఊరెళ్ళి నపుడల్లా  నా గురించి కుశల ప్రశ్నలడుగుతు నిన్నే గుర్తుచేస్తుంటారు...
వారి ముందు నా బాధను బయటపెట్టలేక, 
నీ జ్ఞాపకాలను విడవలేక చాలా సార్లు నాలో నేనే కుమిలిపోతున్నాను...
ఉన్నట్టుండి ఒక్కోసారి ఏడ్చేస్తూన్నాను
ఇంకా చిన్నపిల్లాడిలా ఏంటి అంటూ నా వయసుని గుర్తుచేస్తున్నారు
(ఎంత ఎదిగిన అమ్మ ముందు చిన్నపిల్లాడినే కదా )...

ఒక్కోసారి  అర్ధరాత్రి  మెలకువొచ్చి నువ్వు గుర్తొస్తావ్  
అలా లేచి ఒంటరిగా ఎన్ని సార్లు నాలో నేనే గుక్కపట్టి  ఏడుస్తున్నానో నాకే  తెలియదు... 
ఇంట్లో వాళ్ళు పట్టించుకోరని కాదు
వాళ్ళకి దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా పెద్దగా తేడా ఎమి లేకుండా ఉంది .
కానీ నువ్వు లేని లోటు మాత్రం తెలుస్తూనే ఉంటుంది... 

అన్ని విషయాలు అందరికి చెప్పలేను కదా 
ఎదైనా చెప్పుకోవాలంటే నువ్వుండవ్,
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు.. 
చెప్తే చులకనగా చూస్తారో  లేదా  జాలిపడతారోనని 
నాలోనేనే కుమిలిపోతున్నా ...
అందరు  ఉన్న అనాధలా బ్రతకాల్సివస్తుంది ...

అమ్మ నువ్ లేవు కాని నీ జ్ఞాపకాలు ఎప్పటికి పదిలమే...


"పది సంవత్సరాల మనో వేదనలో  ఇంకా మండుతూ" 

 -నందు 




Sugunamma
                                                      

                                                                  






మిథ్యా ప్రపంచం...!!!





ఈ మిథ్యా ప్రపంచంలో ఏవి శాశ్వతం కావు...
గెలుపోటములు, సుఖదుఃఖాలు,
బంధాలు, అనుబంధాలు,
నువ్వు, నేను, మనందరం...
చరిత్రలు కుడా చిదిమేస్తే చెదిరిపోతాయి 
వాటి గురించి మాట్లాడటం మానేస్తే మరుగునపడి 
కాలగర్భంలో కలిసిపోతాయి

మనకంటూ ప్రసాదితమైంది ప్రస్తుతం మాత్రమే
నేస్తం అనుభవించు ప్రస్తుతాన్ని ప్రతి క్షణం...
                               -నందు
Saturday, January 11, 2014 - , , , , , 2 comments

"1-నేనొక్కడినే"-కొత్తదనం కోరుకునే వారికే..!!!!




నేను సాధారణంగా సినిమాలకి రివ్యూలు రాయను, అది నా వృత్తి కాదు, ప్రవృత్తి కాదు...
కాని నేను చూసిన చాలా సినిమాలలో, అతి కొన్ని సినిమాలకే నా అభిప్రాయాన్ని రాస్తాను....
ఇప్పుడు కూడా అంతే...
చదవాలనిపిస్తే చదవండి లేదు అంటే అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి...

ఇక ఇవాళ  రిలీజ్ అయిన
"1-నేనొక్కడినే" సినిమా ఎన్నో అంచనాలతో, విడుదలకి ముందే ఎన్నో రికార్డులు సృష్టించి ఇవాళ విడుదలైంది..
కథ విషయం పక్కన పెడితే, వందేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు అవే కథలు, సన్నివేశాలు, పాటలతో విసుగు చెందే సగటు ప్రేక్షకుడికి "1-నేనొక్కడినే"  లాంటి సినిమాలు కొంచం ఊరటనిస్తాయనుకోవటంలో సందేహం లేదు..
సుకుమార్ గారు కథను నడిపించిన విధానం,
నిజానికి అబద్దానికి మద్యలో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని కన్ఫ్యూషన్ లో బ్రతుకున్న ఒక యువకుడిగా మహేష్ బాబు గారి నటన బావుంది, అన్ని ఫ్రేముల్లో అతికినట్లు సరిపోయాడు, డాన్సులు కూడా బాగా చేసాడు,
ఇక పతాక సన్నివేశాల్లో వచ్చే సెంటిమెంట్ లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...
ఆయన కుమారుడు గౌతమ్ బాగా చేసాడు....
దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం, నేపథ్య సంగీతం,
రత్నవేలు గారు కెమెరా పనితనం బాగున్నాయి...
చాలా మంది సినిమా నచ్చలేదు అని అంటున్నారట...
నచ్చలేదో లేక వారికి అర్థం కాలేదో ఇప్పటికి నాకు అర్థం కాలేదు...

మనకెప్పుడు 6 పాటలు, 4 ఫైట్లు,కామెడీ, ఇంకొంచం రొమాన్స్...
ఎపుడు ఇవేనా ???
అలాంటి సినిమాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో సంవత్సరానికి 100కి పైగా వస్తున్నాయి...

మనందరికీ హాలీవుడ్ సినిమాలు నచ్చుతాయి డీవీడీలు కొనుక్కుని,
డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తాము,
ధూమ్ లాంటి సినిమాలో స్టంట్స్ చూసి మనవాళ్ళెందుకు తీయరు అని తెగ ఫీల్ అవుతాము,
మన వాళ్ళు ట్రై చేస్తే మాత్రం తేలికగా తీసేస్తాము...

"ఆరెంజ్" లో ప్రేమ కొన్ని రోజులే బావుంటుందని చెప్తే సినిమాని తీసేసాం,
"ఖలేజా" లాంటి సినిమాలో దేవుడే మనిషి రూపంలో వస్తాడు అంటే నవ్వి
 అలాంటి సినిమాలని ఫ్ల్లాప్ అని డిసైడ్ చేస్తాం...
మళ్ళి ఖలేజా ఒరిజినల్ మూవీని  యుట్యూబ్లలో మిగతా వాటిల్లో వెతుకుతాం....
మనకేలాగు సినిమాలు తీయటం రాదు, కనీసం చూడటం రాకపోతే ఎలాగు ??


కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు,
ముఖ్యంగా మహేష్ బాబు యాక్టింగ్ గాని డాన్సులు గాని మిస్ అవ్వదు అనుకుంటే ,
సుకుమార్ గారి స్క్రీన్-ప్లే చూడాలి అనుకునే వాళ్ళు చూడండి..

లేదు మాకు అవే కథలు, థ్రిల్లర్ సినిమాలు వద్దు అనుకుంటే
మాత్రం ఈ సినిమాకి వెళ్ళకండి
మీకు ఈ సినిమానే కాదు ఎలాంటి సినిమాలు చూసినా అర్థం కాదు...
ప్రేక్షకులు సినిమాని అర్థం చేస్కుంటే ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా....

సగటు తెలుగు సినీ అభిమాని..... -నందు


Monday, January 06, 2014 - , , 0 comments

ప్రేమించు ప్రేమతో...!!!



ప్రేమించాలి(ప్రేమించబడాలి) అంటే అందంగా ఉండటమొక్కటే సరిపోదు
అందమైన మనసుండాలి
ఆనందంగా ఆదరించగలగాలి
అర్థం చేసుకునే మనస్తత్వముండాలి
అన్నింటికంటే మిన్నగా నీకు నేనున్నాననే భారోసానివ్వాలి
అప్పుడు నువ్వే తన ప్రపంచం
నువ్వే తన లోకం
నువ్వు లేకపోతే తన బ్రతుకు శూన్యం(ఆడైనా, మగైనా) 
అందుకే నేస్తం ప్రేమించు ప్రేమతో...!!!
-నందు
Monday, November 04, 2013 - , , 4 comments

పారేసుకోవటం...!!!

ప్రేమంటే మనసుని పారేసుకోవటం కాదు
నువ్వున్నపుడు కాలాన్ని,
నువ్వు లేనప్పుడు సంతోషాన్ని,ఆనందాన్ని కోల్పోవటం
నీ సానిహిత్యంలో ఎడబాటుని,
నీ మాటలతో మౌనాన్ని,
నీ తోడులో ఒంటరితనాన్ని పారేసుకోవటం...!!!
                         -నందు 
     


Wednesday, October 30, 2013 - , , 5 comments

సముద్రమంత ప్రేమ కావాలి



నాకు సముద్రమంత ప్రేమ కావాలి
నాకే కాదు నీకు,తనకు, మనందరికీ సముద్రమంత ప్రేమ కావాలి

మరి ఈ విశ్వమంతటికి ప్రేమను పంచేవారెక్కడి నుండి రావాలి ??

నీకు సముద్రమంత ప్రేమ కావాలన్నపుడు 
కనీసం నీవు కాలువంతైనా ప్రేమను పంచాలి కదా??
ఆశించటం మానేసి ఇవ్వటం మొదలెడితే విశ్వమంతా ప్రేమతో నిండిపోతుంది. 

                                                                                -నందు
Thursday, September 26, 2013 - , , , , 3 comments

భార్య-భర్త




భర్త భరించేవాడు కావాలి 
భాదించేవాడు కాదు 
భార్య అర్థం చేసుకునేదిగా ఉండాలి 
కాని వాదించేదిగా కాదు....

అప్పుడే జీవితం సాగుతోంది కలకాలం
                                       -నందు
Saturday, September 21, 2013 - , , , 0 comments

జీవితం అంటే ఇదేనేమో






నీ అనుకునే వాళ్ళు


నిన్ను ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించే వాళ్ళు

నీవు పోయినపుడు చితివరకే వస్తారు 

కాని చితిపైకి రారు...

వాళ్ళు రాలేక కాదు

అదే జీవితం అంటే...

ఎవ్వరున్నా ఆగదు

ఎవ్వరికోసం ఆగదు 


- నందు
Sunday, May 12, 2013 - , 1 comments

అమ్మ ప్రేమ




అమ్మని గురించి అమ్మ ప్రేమ గురించి చెప్పటానికి 
ప్రత్యేకంగా ఒక రోజు కావాలా 
అమ్మ తోడుంటే ప్రతి రోజు మధురమేగా 
ప్రతి డే  మదర్స్ డే  నే కదా... !!! 
  
                   -నందు
Friday, May 10, 2013 - , 0 comments

ఎందుకో ఏమో..!!!



తొలిసారి నిన్ను చూసినప్పుడు నీవైపే చూస్తుండిపోయా  
నీవెవరో తెలుసుకోవాలని నీ వెనకే అడుగులేసా 
నీతో పరిచయం అయ్యాక మాట్లాడకుండా ఉండలేకపోయా   
నువ్వు నా తోడయ్యాక నిన్ను విడిచి ఉండలేకపోతున్నా.... !!! 
                               
                                           -నందు