నన్ను
ప్రేమించు కాని, మరీ దగ్గరకు రాకు
మన మద్య
ఆనందోళ్ళాసాలకు చోటుందని
నన్ను
ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు
నా
కళ్ళు నీ కోసం ఎదురు చూస్తుండనీ
నా మనసు
నీ మాట కోసం మధన పడనీ
నా తనువు
నీ స్పర్శ కోసం తపన పడనీ
నన్ను
ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు
నా
మనసులోని భావాలను ఇలా స్వేచ్చగా ఎగురుతుండనీ
నన్ను
ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు
దూరంగా
ఉండమన్నాను కదా అని
దూరమై(మాయమై
పోకు) పోకు...
-నందు