Showing posts with label సత్యాలు. Show all posts
Showing posts with label సత్యాలు. Show all posts

సరే వెళ్ళు !!


సరే వెళ్ళు !!
వచ్చిపోయే 'వాన'లా నువ్వుంటే
ఎదురుచూసే 'నేల'లా నేనుంటా..!!
- న♥️దు

సమాధానం తెలిసిన ప్రశ్న !!


సమాధానం తెలియనప్పుడు 
మనం ఎన్ని సార్లు ప్రశ్నించినా, 
వెతికినా అర్ధముంటుంది...
కానీ సమాధానం ఇదే 
అని తెలిసినప్పుడు 
ఆ ప్రశ్న గురించి 
ఆలోచింకేకపోవటమే మంచిది..!!
సమాధానం తెలిసినా కూడా 
అదే ఆలోచిస్తున్నామంటే 
మన కంటే మూర్ఖులు 
ఇంకెవ్వరు ఉండకపోవచ్చు 
- నందు

అమ్మలింతే పిచ్చోళ్లు !

అమ్మ:
అమ్మలింతే పిచ్చోళ్లు !
పిల్లలు అల్లరి చేస్తే 
లాగిపెట్టి ఒక్కటిస్తారు
ఏడ్వడం మొదలుపెట్టే లోపే 
దగ్గరకి లాక్కుని లాలిస్తారు.
పిల్లల్ని ప్రేమించటానికి మించిన 
వ్యాపకం మరోకటి ఉండదేమో !!
- 💚దు
01.11.2019.

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్:
1.'కొన్నిసార్లు' మనుషులకంటే
వస్తువులకే విలువివ్వాలి !!
ఎందుకంటే
వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే
జలుబుకయ్యే ఖర్చుకంటే
నీ కంపెనీ ఇచ్చిన లాప్టాప్ తడిస్తే
అయ్యే ఖర్చే ఎక్కువ.!!

2. చిన్నప్పుడు తమ పిల్లల్ని
శ్రీ కృషుడి వేషాల్లో చూసి
మురిసిపోతారు.!
అదే పెద్దయ్యాక కృషుడి
వేషాలు వేస్తే
తోలు తీస్తారు..!!

-నందు
 

దెబ్బతిన్న శిథిలాలు..!!



దెబ్బతిని మిగిలిపోయిన 
శిథిలాల కింద 
ఏ జీవం ఉండదు, 
కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి
గత చరిత్రను 
గుర్తుచేయటానికి
భావితరాలను 
జాగురూక పరచటానికి
-నందు

నచ్చనితనం !!


నచ్చని మనిషి, 
నచ్చని వస్తువు,
అంటూ దూరం చేసుకుంటు ఉంటే 
ఏదో ఒకరోజు 
మనకు మనమే నచ్చని పరిస్థితి రావొచ్చు !!
అప్పుడేం చేస్తాం ???

అందుకే కుదిరితే
మనుషులతో కలుపుకుని పోవాలి..!
వస్తువులతో సర్దుకుపోవాలి..!!
-నందు

జ్ఞాపకాలు

మనిషి జీవితంలో 
మంచివో చెడ్డవో 
కొన్ని జ్ఞాపకాలుంటాయ్ 
కొన్నిటిని మరువక తప్పదు 
కొన్నింటిని విడువక తప్పదు 
కానీ కొన్నింటితో 
మాత్రం కలిసి బ్రతకక తప్పదు 

 -నందు 

జ్ఞాపకాల విలువెంత ?

జ్ఞాపకాల విలువెంత ??

ఒక తరం మర్చిపోలేనంత..!
ఇంకో తరం గుర్తుపెట్టుకునేటంత..!!
ముందు తరానికి  గుర్తు చేసేటంత..!!!
-నందు

anand+goud+pedduri

సొంతవూరు (పల్లెటూరు)



#సొంతవూరు
#పల్లెటూరు
కార్పొరేట్ కొలువులు,
ఖరీదైన చదువులు,
కల్మషమైన మనసులు,
కల్తీయైన వ్యాపారాలు,
ప్రేమ లేని పలకరింపులు
అనురాగల్లేని అనుబంధాలు
పుట్టినరోజుకో, పెళ్లిరోజుకో 
వచ్చే పక్కింటి నుండి పిలుపులు
పదేళ్లు పక్క పక్కనే ఉన్నా 
ఆత్మీయత లేని పలకరింపులు,
ఎన్నో ఆశలతో బ్రతికే 
మధ్య తరగతి జీవితాలు 
ఇవే ఉంటాయి పట్టణాల్లో ..!!

పల్లెల్లో ఏముంది అనుకుని
పట్నం వచ్చాక
పల్లెల విలువ తెలిసొస్తుంది 
పట్టణాల్లో పెద్ద పెద్ద అపార్టుమెంట్లలో ఉన్నా కూడ 
సొంతఊర్లలో పాతింట్లో ఉన్నప్పటి 
ప్రశాంతత ఉండదు మనకి..!


ఉన్నామా తిన్నామా లేదా అని
పలకిరించే నాధుడుండడు,
చిన్ననాటి మిత్రుడో
లేదా ఊర్లో వ్యక్తో కనిపిస్తే
మాటల్లో పడి
కాలమే మర్చిపోతాం.. !

పల్లెటూర్లో ఉంటె పొద్దున్న
తెల్లారినప్పటి నుండి 
రాత్రి వరకు ఎవరో ఒకరు 
తారసపడుతూనే ఉంటారు
ఎలాంటి సంబంధాల్లేకున్నా 
పేర్లకంటే ఎక్కువ
వరసలతోనే పిలుచుకుంటారు..!!
ప్రపంచీకరణ
ఆధునికత,
బతుకుదెవురువంటు
రకరకాల కారణాలతో 
పట్టణాల్లో ఉంటున్నాం గాని
పల్లెలకంటే సంతోషమైన జీవితం 
పట్టణాల్లో ఎక్కడిది ??

పదేళ్ళకొక్కసారి సొంతూరికి వెళ్లినా 
ఎప్పురొచ్చావురా అని పలకరించే వాళ్ళు
చాలా మందే ఉంటారు
అదే పట్నంలో పదేళ్లు పక్క పక్కనే ఉన్నా 
కలిసే ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు...!!

పల్లెటూర్లో భూములు, ఆస్తులు 
ఉన్నా లేకపోయినా 
జీవం,జీవితం రెండు ఉంటాయి
ఇది అక్కడ పుట్టిపెరిగిన ప్రతివారికి
బాగా అర్థం అవుతాయి 
-నందు
17.07. 19

లేని వ్యక్తిత్వం



నువ్వు చస్తే మోయటానికి 
వచ్చే మనుషులు 
నీ వ్యక్తిత్వాన్ని చూసి రావాలి 
కానీ నీ వెనకాల ఉన్న 
డబ్బుని చూసి కాదు 
వ్యక్తిత్వమేలేనప్పుడు 
వందల కోట్లు ఉండి 
కూడా ఎం లాభం ?

-నందు


చేసిన సహాయం


కారణం లేని ప్రేమ

ఏ కారణం లేకుండా పుట్టేది ప్రేమ
ఏ కారణం లేకుండా విడిపోయేది కూడా ప్రేమే 
అసలు కారణం లేకుండా ఈ భూమ్మీద
 ఏదైనా ఉందటే  అది ప్రేమే  
-నందు 

వెన్నెల్లో తడవటమేగా !!!

సూర్యుడెపుడు అస్తమిస్తాడని నేనెదురు చూస్తుంటాను...!!
చంద్రుడెప్పుడు వస్తాడని నువ్వేదురు చూస్తుంటావు..!!
ఆలోచన వేరు కావొచ్చు కానీ,
ఆశ మాత్రం వెన్నెల్లో తడవటమేగా !!!
-నందు  

సహాయం

ఎదుటి వాళ్ళు మనకి చేసిన 

సహాయాన్ని సులువుగా మర్చిపోతాం 

కానీ వాళ్ళు ఏదైనా అంటే 

దాన్ని మాత్రం ఎప్పటికి

 గుర్తుంచుకుంటాం 
-నందు 


స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

ఒకప్పుడు మనం స్కూల్లో కాలేజీల్లో ఫ్రెండ్స్ని చేస్కునే వాళ్ళం, 
ఇప్పుడిలా ఫేస్బుక్ లో చేసుకుంటున్నాం..
ఎన్నో విషయాల్ని మిత్రులతో షేర్ చేస్కునే వాళ్ళం,
ఇప్పుడిలా ఫేసుబుక్లో, ఇంస్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాం..
ఫ్రెండ్స్తో ఫోటోలు దిగి భద్రంగా దాచుకునే వాళ్ళం,
ఇప్పుడిలా ఫోటోలు పెట్టి ట్యాగ్గింగ్ చేస్తున్నాం...
ఫ్రెండ్షిప్స్ బ్యాండ్స్ కట్టి ఒకరినోకోరం విష్ చేసుకునే వాళ్ళం,
ఇప్పుడిలా స్టేటస్ లు పెట్టి పలకరించుకుంటున్నాం...

హ్యాపీ ఫ్రెండ్షిప్ డే 
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

-నందు.

బంధాలు



జీవితంలో బంధాలను ఏర్పరచుకోవడం, 
వదులుకోవడం అనేది 
ఫెసుబుక్లో ఆడ్ ఫ్రెండ్ /అన్ ఫ్రెండ్ చేసినంత సులువుకాదు...

ఒకసారి Unfriend చేస్తే 
మళ్ళీ add req పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ జీవితంలో మళ్ళి ఆ బంధం బలపడాలంటే 
కొన్ని వందల మెట్లు దిగిరావాలి, 
వేల మైళ్ళు వెనక్కి నడవాలి...!!
-నందు.



గుణాత్మక మార్పు


గీ హైదరాబాద్ రోడ్ల కింద లంకే బిందెలు ఉన్నావా ఏందీ  ?
లేక బంగారు తెలంగాణ జేయనీకే బంగారం కోసం తొవ్వుతున్నారా ఊకె ??

వారం కిందనే సంతోష్ నగర్ నుండి సైదాబాద్, చంచల్ గూడ జైలు వరకు
మంచిగా  రోడ్డు ఏశిన్రు అనుకుంటుంటే 
మళ్ల తెల్లారే  తొవ్వుడు షురూ జేశిన్రు...

గీ ఏసుడు మల్ల తొవ్వుడు,మల్లేసుడు మల్ల తొవ్వుడు  ఏందీ ఈ పంచాతి ?
సారు ముందే అన్ని తవ్వకాలయిపోయినాక ఎస్తే కాద ?
లేక  కాంట్రాక్టర్లకు ఉపాధి హామీ పని దొరకదు  అనుకున్నరా ఏందీ ?

రెండు ప్రభుత్వ శాఖల మధ్యనే సమన్వయం లేదు,
రెండు మూడు రాష్త్రాల మధ్య సమన్వయం ఎట్లొస్తది ?

దేశంల గుణాత్మక మార్పు యాడొస్తది ??

-నందు 

చితికిన బాల్యం

 మూడింటికో బడైపోతే
దోస్తులతో పెద్దబడి కాడికి పోయి ,
 గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో
కబడ్డో ఆడుతావుంటే 
వాటిని సూత్తూ  సూత్తూ,
మన తోటి పిల్లలతో  పతంగొ,గోళీలాటో
ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో  
ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు
గోరుముద్దలు తిని నిద్రపోతాం 
ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి 
ఎండకాలం పోయే దాకా 
మన ఊరి చెరువులోనోబావుల్లోనో
మనింట్లో నాన్నానోఅన్నానో తీసుకెళ్లి,
మన దోస్తులని వెంటేసుకెళ్ళి మరీ 
ఈత నేర్చుకుంటాం..
సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లినపుడు
తాత ఎంతో ప్రేమతో చేయించిన/చేసిన చక్రాల బండిని 
మనింటికి తీసుకువచ్చి 
దానితో ఆడుకుంటూ సంబరపడి పోతాం
పది దాక మనవూళ్ళోనే సదువుకుని 
పెద్ద సదువుకోసం 
పట్నంలోపక్కూరో వెళ్ళేదాకా 
మన బాల్యాన్ని ఆస్వాదించాం
కానీ,
 కాలం పిల్లలు 
రెండేళ్ళకి సెల్ల్ఫోనకి అలవాటు పడి
మూడేళ్లకే బడికిపోయి,
ఆటలంటే  టెంపుల్ రన్నో ,
కాండీక్రస్షో అనుకుంటూ
మొబైల్ యాప్లలో ఆటలాడుకుంటూ 
ఇవే ఔట్డోర్ గేమ్స్ అనుకుంటున్నారు
భవిష్యత్ అనే భూతానికి బయపడి
తల్లి దండ్రులు కూడా ర్యాంకులు
చదువులు అంటూ బాల్యాన్ని 
బందిఖానాలో పడేస్తున్నారు.!!
-నందు