చితికిన బాల్యం

 మూడింటికో బడైపోతే
దోస్తులతో పెద్దబడి కాడికి పోయి ,
 గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో
కబడ్డో ఆడుతావుంటే 
వాటిని సూత్తూ  సూత్తూ,
మన తోటి పిల్లలతో  పతంగొ,గోళీలాటో
ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో  
ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు
గోరుముద్దలు తిని నిద్రపోతాం 
ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి 
ఎండకాలం పోయే దాకా 
మన ఊరి చెరువులోనోబావుల్లోనో
మనింట్లో నాన్నానోఅన్నానో తీసుకెళ్లి,
మన దోస్తులని వెంటేసుకెళ్ళి మరీ 
ఈత నేర్చుకుంటాం..
సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లినపుడు
తాత ఎంతో ప్రేమతో చేయించిన/చేసిన చక్రాల బండిని 
మనింటికి తీసుకువచ్చి 
దానితో ఆడుకుంటూ సంబరపడి పోతాం
పది దాక మనవూళ్ళోనే సదువుకుని 
పెద్ద సదువుకోసం 
పట్నంలోపక్కూరో వెళ్ళేదాకా 
మన బాల్యాన్ని ఆస్వాదించాం
కానీ,
 కాలం పిల్లలు 
రెండేళ్ళకి సెల్ల్ఫోనకి అలవాటు పడి
మూడేళ్లకే బడికిపోయి,
ఆటలంటే  టెంపుల్ రన్నో ,
కాండీక్రస్షో అనుకుంటూ
మొబైల్ యాప్లలో ఆటలాడుకుంటూ 
ఇవే ఔట్డోర్ గేమ్స్ అనుకుంటున్నారు
భవిష్యత్ అనే భూతానికి బయపడి
తల్లి దండ్రులు కూడా ర్యాంకులు
చదువులు అంటూ బాల్యాన్ని 
బందిఖానాలో పడేస్తున్నారు.!!
-నందు

0 comments: