Showing posts with label తెలుగు కవితలు. Show all posts
Showing posts with label తెలుగు కవితలు. Show all posts

సమాధానం తెలిసిన ప్రశ్న !!


సమాధానం తెలియనప్పుడు 
మనం ఎన్ని సార్లు ప్రశ్నించినా, 
వెతికినా అర్ధముంటుంది...
కానీ సమాధానం ఇదే 
అని తెలిసినప్పుడు 
ఆ ప్రశ్న గురించి 
ఆలోచింకేకపోవటమే మంచిది..!!
సమాధానం తెలిసినా కూడా 
అదే ఆలోచిస్తున్నామంటే 
మన కంటే మూర్ఖులు 
ఇంకెవ్వరు ఉండకపోవచ్చు 
- నందు

బ్రతికున్నప్పుడు లేని బంధాలు


బ్రతికున్నప్పుడు ఒకరి మొహం
ఒకరు చూసుకోలేనంతగా బ్రతికి ,
పలకరిస్తే మొహం తిప్పుకుని తిరిగి,
చచ్చాక మాత్రం చివరి చూపులకి 
ఆరాటపడటం ఎందుకు ??

తన ఆత్మ శాంతించదనా ?
లేక నీ అంతరాత్మ సంతృప్తి చెందదనా ??
బ్రతికున్నప్పుడు లేని బంధాలు
చచ్చాక మాత్రం ఎందుకు ??
- ☹️దు

రియాలిటీ చెక్

రియాలిటీ చెక్:
1.'కొన్నిసార్లు' మనుషులకంటే
వస్తువులకే విలువివ్వాలి !!
ఎందుకంటే
వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే
జలుబుకయ్యే ఖర్చుకంటే
నీ కంపెనీ ఇచ్చిన లాప్టాప్ తడిస్తే
అయ్యే ఖర్చే ఎక్కువ.!!

2. చిన్నప్పుడు తమ పిల్లల్ని
శ్రీ కృషుడి వేషాల్లో చూసి
మురిసిపోతారు.!
అదే పెద్దయ్యాక కృషుడి
వేషాలు వేస్తే
తోలు తీస్తారు..!!

-నందు
 

దెబ్బతిన్న శిథిలాలు..!!



దెబ్బతిని మిగిలిపోయిన 
శిథిలాల కింద 
ఏ జీవం ఉండదు, 
కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి
గత చరిత్రను 
గుర్తుచేయటానికి
భావితరాలను 
జాగురూక పరచటానికి
-నందు

జ్ఞాపకాలు

మనిషి జీవితంలో 
మంచివో చెడ్డవో 
కొన్ని జ్ఞాపకాలుంటాయ్ 
కొన్నిటిని మరువక తప్పదు 
కొన్నింటిని విడువక తప్పదు 
కానీ కొన్నింటితో 
మాత్రం కలిసి బ్రతకక తప్పదు 

 -నందు 

జ్ఞాపకాల విలువెంత ?

జ్ఞాపకాల విలువెంత ??

ఒక తరం మర్చిపోలేనంత..!
ఇంకో తరం గుర్తుపెట్టుకునేటంత..!!
ముందు తరానికి  గుర్తు చేసేటంత..!!!
-నందు

anand+goud+pedduri

గతం తాలూకు జ్ఞాపకాలు...!!!!



ఎన్నేళ్ళయిందో మనిద్దరం కలిసి 
కానీ నిన్ననే చూసినట్లుంది 
ఎం మాట్లాడామో గుర్తురావట్లేదు 
కానీ ఇందాకే పలకరించినట్లుంది 
నీ సాంగత్యం  కోసం ఎదురు చుసిన బస్టాండ్లు
కాలేజీలోని జ్ఞాపకాలింకా 
కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయ్..
నీతో  మాట్లాడుకుంటూ మీ వీధి చివరకొచ్చి
వాటిని  తల్చుకుంటూ నాలోనేను నవ్వుకుంటూ,
వెనక్కి  వచ్చిన  క్షణాలు వెక్కిరిస్తూనే ఉన్నాయ్..
అన్నేళ్ల మన పరిచయంలో
ఎన్ని పోట్లాటలొచ్చినా 
మన ప్రేమ ముందు ఓడిపోతూనే
 మనల్ని  గెలిపించాయి..
ప్రేమ కన్నా పరువే ముఖ్యమని 
మీ ఇంట్లో వాళ్ళు నన్ను మర్చిపొమ్మని 
నిన్ను బాధపెట్టినప్పుడు 
నువ్వు  పడిన నరకయాతన  నేనూహించగలను...
ఎలాగైనా మర్చిపోవాలని వాళ్ళన్నపుడు,
ఎలా మర్చిపోవాలని నువ్వు నాకు దూరమైనప్పుడు 
నాతో  బంధాన్ని తెంచుకుని నువ్వా బందీకానలో
మగ్గి నన్ను పూర్తిగా మర్చిపోయినపుడు,
మర్చిపోలేనంతగా ఏకమైన మన మనసుల 
జ్ఞాపకాల తాలూకు గాయాలు  వెంటాడుతున్నా,
నీతో  మాట్లాడిన  చివరి  క్షణమే  
చివరదని ఊహించని  నా పిచ్చిమనసు  
నిన్నింకా మర్చిపోకుండా ప్రేమిస్తూ 
నీ జ్ఞాపకాల్లో బ్రతికేస్తుంది 
నువ్వు లేని ఇన్నేళ్ల నా జీవితంలో 
నేనెంత సంతోషంగా ఉన్నా 
ఆనందాన్ని నీతో పంచుకోలేక 
నరకం అనుభవిస్తున్నా ప్రియా...!!!

ఇట్లు  
ఎప్పటికి  నిన్ను  ప్రేమించే  నీ కార్తిక్

-నందు 

పి. యస్ : ఇది నేను రాస్తున్న  నవలలోని ఒక  లేఖ 
Date :11-01-18

లేని వ్యక్తిత్వం



నువ్వు చస్తే మోయటానికి 
వచ్చే మనుషులు 
నీ వ్యక్తిత్వాన్ని చూసి రావాలి 
కానీ నీ వెనకాల ఉన్న 
డబ్బుని చూసి కాదు 
వ్యక్తిత్వమేలేనప్పుడు 
వందల కోట్లు ఉండి 
కూడా ఎం లాభం ?

-నందు


చేసిన సహాయం


కారణం లేని ప్రేమ

ఏ కారణం లేకుండా పుట్టేది ప్రేమ
ఏ కారణం లేకుండా విడిపోయేది కూడా ప్రేమే 
అసలు కారణం లేకుండా ఈ భూమ్మీద
 ఏదైనా ఉందటే  అది ప్రేమే  
-నందు 

వెన్నెల్లో తడవటమేగా !!!

సూర్యుడెపుడు అస్తమిస్తాడని నేనెదురు చూస్తుంటాను...!!
చంద్రుడెప్పుడు వస్తాడని నువ్వేదురు చూస్తుంటావు..!!
ఆలోచన వేరు కావొచ్చు కానీ,
ఆశ మాత్రం వెన్నెల్లో తడవటమేగా !!!
-నందు  

సహాయం

ఎదుటి వాళ్ళు మనకి చేసిన 

సహాయాన్ని సులువుగా మర్చిపోతాం 

కానీ వాళ్ళు ఏదైనా అంటే 

దాన్ని మాత్రం ఎప్పటికి

 గుర్తుంచుకుంటాం 
-నందు 


బంధాలు



జీవితంలో బంధాలను ఏర్పరచుకోవడం, 
వదులుకోవడం అనేది 
ఫెసుబుక్లో ఆడ్ ఫ్రెండ్ /అన్ ఫ్రెండ్ చేసినంత సులువుకాదు...

ఒకసారి Unfriend చేస్తే 
మళ్ళీ add req పెట్టే అవకాశం ఉంటుంది.
కానీ జీవితంలో మళ్ళి ఆ బంధం బలపడాలంటే 
కొన్ని వందల మెట్లు దిగిరావాలి, 
వేల మైళ్ళు వెనక్కి నడవాలి...!!
-నందు.



చితికిన బాల్యం

 మూడింటికో బడైపోతే
దోస్తులతో పెద్దబడి కాడికి పోయి ,
 గ్రౌండ్లో  పెద్ద బడి పిల్లలు కిరికెట్తో
కబడ్డో ఆడుతావుంటే 
వాటిని సూత్తూ  సూత్తూ,
మన తోటి పిల్లలతో  పతంగొ,గోళీలాటో
ఎదో ఒకాట ఆడుతూ రాత్రి ఆరింటికో ఏడింటికో  
ఇంటికెళ్లి అమ్మ పెట్టు చివాట్లు
గోరుముద్దలు తిని నిద్రపోతాం 
ఒకపూట బళ్ళు మొదలైనప్పటి నుండి 
ఎండకాలం పోయే దాకా 
మన ఊరి చెరువులోనోబావుల్లోనో
మనింట్లో నాన్నానోఅన్నానో తీసుకెళ్లి,
మన దోస్తులని వెంటేసుకెళ్ళి మరీ 
ఈత నేర్చుకుంటాం..
సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లినపుడు
తాత ఎంతో ప్రేమతో చేయించిన/చేసిన చక్రాల బండిని 
మనింటికి తీసుకువచ్చి 
దానితో ఆడుకుంటూ సంబరపడి పోతాం
పది దాక మనవూళ్ళోనే సదువుకుని 
పెద్ద సదువుకోసం 
పట్నంలోపక్కూరో వెళ్ళేదాకా 
మన బాల్యాన్ని ఆస్వాదించాం
కానీ,
 కాలం పిల్లలు 
రెండేళ్ళకి సెల్ల్ఫోనకి అలవాటు పడి
మూడేళ్లకే బడికిపోయి,
ఆటలంటే  టెంపుల్ రన్నో ,
కాండీక్రస్షో అనుకుంటూ
మొబైల్ యాప్లలో ఆటలాడుకుంటూ 
ఇవే ఔట్డోర్ గేమ్స్ అనుకుంటున్నారు
భవిష్యత్ అనే భూతానికి బయపడి
తల్లి దండ్రులు కూడా ర్యాంకులు
చదువులు అంటూ బాల్యాన్ని 
బందిఖానాలో పడేస్తున్నారు.!!
-నందు