Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts
Monday, August 08, 2011 - , 4 comments

ఒక వర్షాకాలపు సాయంత్రపు వేళ...!





అదొక వర్షాకాలపు సాయంత్రం అందులోనూ అమావాస్య,ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది, ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి... 
అప్పుడప్పుడే చీకటి పడుతుంది, నేను ఆఫీసు నుండి  బయలుదేరే సమయానికే చాలా చీకటి పడింది,
ఇంటికి వెళ్ళాలనే తొందరలో నేను వడి వడిగా అడుగులు వేస్తున్నాను నా అవస్థ చూసి మేఘాలకి కూడా జాలేసినట్లుంది
అందుకేనేమో కన్నీరు కారుస్తుంది (వర్షం కురవటం మొదలయింది)....!
నేను అలా నడుస్తూనే ఉన్నాను, నా వెనకాల ఏదో అలికిడి వినిపిస్తుంది ఎవరో నాలాగ ఇంటికి వెళ్ళాలనే తొందరలో ఉన్నట్లున్నారు నేనేమి పట్టించుకోకుడా త్వరత్వరగా నడుస్తున్నాను.... 
ఇంతలో ఒక్కసారిగా  నా అవస్థకు  బాదపడుతూ  మెరుపులు మారోసారి రోధించాయి(మెరిసాయి), ఇంతలో ఒక అందమైన ఆకారం నన్ను దాటుకుంటూ వెళ్లిపోయింది... 
 అంత వరకు తెలియదు ఇంత సేపు నా వెనకాల నుండి నడుస్తున్నది ఒక అందమైన అమ్మాయి అని.... ఎర్రటి ఆ మెరుపులో,  ఎర్రటి నిండైన చీరలో తన  మొహాన్ని చూసాను.... దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది తన రూపం, ఆ కళ్ళైతే మరీను ఎంత సేపు చూసినా తనివితీరదేమో....
చూసిన క్షణం లోనే ఒక్కసారి ఆకాశపుటంచులదాక  అలా అలా తేలియాడి వచ్చాను...
తను వెళ్తూనే ఉంది నేను త్వరగా తేరుకుని తన  వెంటే వెళ్ళాను తనతో ఎలాగైనా మాట్లాడాలనిపించింది ఇక దైర్యం  చేసి తన పక్కకి వెళ్ళాను  అంత లోపే తను నా వైపు చూసింది ఆ కళ్ళల్లో ఏదైనా శక్తి దాగి ఉందేమో... ఒక్కసారిగా నా మనసును  తనవైపే లాగేసింది అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ....
తను ముందు నన్ను చూసి ఉలిక్కి(బయపడినా) పడినా, నా అవస్థ చూసి కళ్ళతోనే మట్లాడేసింది... 
"ఎం మాట్లాడాలో తెలీక మీతో నడవవచ్చా అని అడిగాను.... తను కాసేపు ఏదో ఆలోచించింది, తరువాత  చిరునవ్వు నవ్వి  నా చేతిని  అందుకోబోయింది......
అంతలోపే

అగ్ని పర్వతం నుండి పొంగుతున్న లావాను ఉప్పొంగిన సముద్రపు కెరటాలు ముంచేసినంత   ఫీలింగ్...
 చిన్నపాపలాగా గెంతుతూ తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలను  తిమింగలం లాంటి ఒక పెద్ద అల మింగేసినట్లు.... 
నాకొచ్చిన ఒక అందమైన "కల"ను నా మెలకువ మింగేసింది.........
                                                                     -నందు
Wednesday, April 06, 2011 - , 4 comments

రాంగోపాల్ వర్మ(ఒక మంచి పిచ్చోడు )




రాంగోపాల్  వర్మ

రాంగోపాల్ వర్మ... ఈ  పేరు వినగానే సిని జనాలకి  కాని, మాములు ప్రేక్షకులకు కాని ఎక్కడ లేని ఇంట్రస్తూ పుట్టుకొస్తుంది..
అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నది కూడా వర్మా నే....
సాదారణంగా జనాలలో పిచోళ్ళు ఉంటారని అందులో మంచి పిచోళ్ళు ఉంటారని నేనంటాను, పిచోళ్ళను కుడా అభిమానించే  పిచ్చి ఫాన్స్ లో నేను మినహాహింపేమి కాదు...

మాములుగా  అయితే మనల్ని మనం పోగుడుకోవటం లో ముందుంటాం ,అదే తిట్టుకోవటంలో అయితే  చివరలో  ఉంటాం.. 
కాని వర్మ తనని తనే ముందు తిట్టుకుని మిగతా వాళ్ళని తరవాత తిట్టడం మొదలెడతాడు...
అందుకు "అప్పలరాజు" సినిమా ఒక ఉదాహరణ మాత్రమే.....
ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ న్యూస్ లో ఉంటూ ,సేన్సషన్ పుట్టిస్తాడు...
పన్నెండు  సంవత్సరాల తరవాత తెలుగు సినిమా అని జనాలంతా  ఎగబడి "అప్పలరాజు" సినిమా కెళ్తే పాపం  చుక్కలు చూపించాడు... 
కామెడీ, ట్రాజెడి  అంటూ తిక మక పెట్టి అర్థం కాకుండా చేసాడు..
వర్మ ఎప్పుడు   అంటుంటాడు నేనేవరికోసం సినిమాలు తీయను అని...
కాని నాకెందుకో మొదటి సారి తను చెప్పింది  కూడా నిజమేమో అనిపించింది...
ఎందుకంటే "అప్పలరాజు" అనే సినిమా ఎవరికీ అర్థం  కావాలో వారికి అర్థం  అయింది, అవుతుంది..
కాని  ఒక్కటి మాత్రం నిజం... 
ఎన్ని ప్లాప్ సినిమాలు  తీసినా జనాలు ఇంకా వర్మ సినిమా చూడటానికి ఇష్టపడతారు ఇది నిజం, 
కారణం ఎందుకంటే  వర్మ అనే ఒక పేరు అనటంలో అతియోశక్తి లేదు....
వర్మ కి భాగ తెలుసు ఫాన్స్ లేకపోతే తన సినిమాలు ఆడవు అని, తను మాత్రం ఈ విషయాన్నీ ఒప్పుకోడు...

ఏదేమైనా  ఎక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పాలి..
ఈసారైనా  వర్మ సినిమా భావుంటుదేమోనని  జనాలు తన  సినిమా చూస్తారు...
ఈ సినిమా కుడా భావుంటుంది అని వర్మ సినిమాలు తీస్తాడు..
ఇవన్నీ వదిలేస్తే ఫిలిం ఇండస్ట్రి లో ఇంతక ముందు ఇలాంటి చెత్త (వింత) సినిమాలు తీసిన, ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయబోయే  డైరెక్టర్ ఒకే ఒక్కరున్నరూ .....ఆయనే ది గ్రేట్ "రాంగోపాల్  వర్మ"
వర్మ తన ఫ్యూచర్ లో ఇంక వంద సినిమాలు తీసిన జనాలు చూస్తారు .
 దానికి  కారణం జనాలకి "వర్మ" పై, వర్మకి   "జనాల"పై  నమ్మకం..
ఆ నమ్మకమే తనని ఇంక సిని పరిశ్రమలో పేరుతెచ్చి పెడుతుంది...


వర్మ పై అల్లిన ఈ  కథకి మాత్రం స్క్రీన్ ప్లే, డైరెక్షన్  నాదే..
మీ అబిమాని

                 ఎ స్టొరీ బై ఆనంద్ గౌడ్ పెద్దూరి...