పిచ్చి మనసు

తనతో బయటికి వెళ్ళినప్పుడు 
ఎవ్వరూ గుర్తు పట్టకుండా స్కార్ఫ్ కట్టే దాన్ని,

కానీ ఇపుడు తను ఎక్కడ నన్ను గుర్తు పడతాడేమో అని 
మళ్ళీ స్కార్ఫ్ కట్టుకు తిరుగుతున్నా...

అయిన, నా పిచ్చి గానీ 

తను మొదట్లో నన్ను ఇష్టపడిందే నా కళ్ళని చూసి, 

మొహానికి ముసుగేసినంత మాత్రాన 
నా కళ్ళని గుర్తు పట్టలేడా ???
చెబితే  విననంటోంది  ఈ పిచ్చి మనసు
  
                               -నందు

 

నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది

నువ్వెలా ఉంటావో తెలియదు,
కాని చూడాలనిపిస్తోంది.
నువ్వెక్కడుంటావో తెలీదు,
కాని నిన్ను కలవాలనిపిస్తోంది.
నీ స్వరమెలా ఉంటుందో తెలియదు,
కాని నువ్ మాట్లాడితే వినాలనిపిస్తుంది. 
ఎం చేస్తుంటావో తెలియదు,
కానీ నీ కోసం ఏమైనా చేయాలనిపిస్తోంది. 
నీ మనసులో నేనుంటానో  లేదో తెలియదు
కాని నిన్ను మాత్రమే ప్రేమించాలనిపిస్తోంది...
                                             -నందు 

కొన్ని అంతే...!!!

అవసరంతో చేసే స్నేహాలు
వ్యామోహంలో పడే ప్రేమలు
ఆవేశంలో ఇచ్చే వాగ్దానాలు
కోపంలో తీసుకునే నిర్ణయాలు
ఎక్కువ రోజులు నిలబడవు...
-నందు