నేస్తం
"నువ్వు నాకు పరిచయం కాక ముందు
నాకు ఆ కాలేజీలో రోజులన్నీ ఒకేలా ఉండేవి...
నాకు ఆ కాలేజీలో రోజులన్నీ ఒకేలా ఉండేవి...
నీ పరిచయం వల్ల ఎందుకో నాలో మార్పు,
నాలో నాకే తెలియనంత మార్పు...
నాలో నాకే తెలియనంత మార్పు...
నువ్వొచ్చాక నా డైరీ రంగుల పుస్తకంగా మారిపోయింది...
ప్రతి రోజు నీతో స్నేహం గురించే రాసాను
నిన్ను తలచుకుంటూ,
నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ,
నీతో మాటాడిన సంతోషంలోనో,
లేక నువ్వు మాట్లాడలేదన్న బాధలోనో...
నిన్ను చూసి చాలా విషయాలలో స్పూర్తిపొందాను
ఎప్పుడైనా నీకు ఫోన్ చేసే నీ ఫోన్ బిజీగా ఉంటే నేనెంత బాధపడేవాడినో తెలుసా..?
నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నందుకు కాదు,
ఆ క్షణాన నీతో మాట్లాడలేకపోయినందుకు...!
ఉన్నట్టుండి నువ్వు మాట్లాడటం మానేసావు
మళ్లి నా గమ్యం అంతా చంద్రుడు లేని ఆకాశంగా మారిపోయింది.
ఈ మద్య నిన్ను తలచుకుంటూ నిద్ర పట్టక ఏ అర్ధరాత్రికో నిద్రపోయిన రోజులు లెక్కలేనన్ని...
అయిన ఇప్పటికి ఏమి మారలేదు
ఎక్కడైనా అందమైన చిరునవ్వు కనిపిస్తే చాలు నువ్వే గుర్తొస్తావు....
అదేంటో నువ్వు గుర్తొచ్చిన ప్రతి సారి నాకే తెలియకుండా
నా కంటి నుండి కన్నీటిధారా కురుస్తూనే ఉంది...
మిత్రమా...!!!
నీవులేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం...
ఫోటోలలో, బహుమతులలో కాదు.. నా గుండెల్లో.
నా కంటి నుండి కన్నీటిధారా కురుస్తూనే ఉంది...
మిత్రమా...!!!
నీవులేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం...
ఫోటోలలో, బహుమతులలో కాదు.. నా గుండెల్లో.
ఎప్పటికి నీ నేను..."
-నందు
0 comments:
Post a Comment