ఎవరినో ప్రేమిస్తావు
మరెవరినో పెళ్లి చేసుకుంటావు
గుండె లోతుల్లో ఒకరు గుండెలపై మరొకరు..
నీలో ఒకరు, నీతో ఒకరు..
తనపై నీ ప్రేమకు గుర్తుగా నీ మెయిల్ ఐడికో,
లేక నీ కంప్యూటర్ కో తన పేరుని పాస్ వర్డ్ గా తగిలిస్తావు
తన పేరునో లేక తన పేరులోని మొదటి అక్షరంతోనో నీ పిల్లలకి పేరు పెట్టుకుని మురిసిపోతావు
తను గుర్తోచ్చినపుడల్లా నీలో అనాలోచితంగా ఏవో స్పందనలు
తను గుర్తొచ్చిన ఆనందంలోనో లేక తనతో వీడిపోయినందుకు కలుగుతున్న ఆవేదనతోనో.
ఆ రెండింటిని గుర్తుపట్టకుండా
సాయంకాలపు వెలుగులను కమ్ముకొస్తున్న కారు చీకట్లు
కప్పెసినట్లు ఎప్పుడు నింపాదిగా ఉండే నీ నిర్మలమైన మనసు...
ఓ మనిషి...!!!
ఇవేనా నీ విరహ వేదనకు సాక్షాలు...

సుఖంగా ఉండి సంతోషంగా లేని జీవితాలకి అంకితం...నందు