Sunday, October 07, 2012 - , 0 comments

నువ్వెవరు...??





ఎప్పుడు ఎక్కడ  కనిపిస్తావో ఎలాపరిచయమవుతావో 
ఇంతకి  నువ్వు  ఎవ్వరో  ఎలా  ఉంటావో  తెలిదు
కాని  మరి  ఎందుకు  నాలో  ఈ  వింత  స్పందన...!
నిన్ను  చూడాలని, నీతో మాట్లాడాలని 
ఎన్నో ఊసులు  నీతో  చెప్పుకోవాలని  ఏదో  ఆరాటం
ఎందుకిలానో  తెలియదు  
కాని  నిన్ను  ఊహించుకున్నప్పుడల్లా నాలో  ఏదో  మార్పు
 ఏదో  తెలీని  గర్వం 
నిన్ను  ప్రేమించి  పెళ్లి  చేసుకుంటానో  లేక  
పెళ్లి  చేసుకుని  ప్రేమిస్తానో  తెలియదు  కాని 
నువ్వు  కావలి  నా  తోడుగా 
ఉండాలి  నా   నీడగా 
మరి  నువ్వేప్పుడో  స్తావు  చెలి  నా  జీవితంలోకి 
వచ్చాక  వెళ్లవుగా  మరి 
కడదాక  సన్నిహితుడిలా
తోడుగా  నీడగా  జీవితాంతం 
నీకోసం  ఎదురు  చూస్తూ.....  
                              నీ నేను
                                  
                               -నందు

Saturday, October 06, 2012 - , 5 comments

కల్తీ లేని ప్రేమ...!!




నేస్తం..!!



యుగాలెన్నిమారినా ,

కాలం ఎంత గడిచినా , 

మానవుడి మనుగడ చివరివరకైన  అమ్మ  ప్రేమలో  కల్తి  ఉండదు,

ఉండబోదు అని చెప్పనివారు ఉండరు... 

ఎందుకంటే ప్రేమ గుడ్డిది మూగది చెవిటిది అని ఎన్నెనో చెప్పే మనం అది ఒక 


అమ్మాయి అబ్బాయి విషయంలో మాత్రమే...


అమ్మ ప్రేమలో  కల్తి  ఉండదు మన  మీద కనికరం తప్ప
అమ్మ ప్రేమలో అనుమానం ఉండదు  ఆప్యాయత, అనురాగాలు తప్ప...
అమ్మ ప్రేమలో కోపం ఉండొచ్చు కాని అది తమ  బిడ్దల  బాగు  కొరకు 

మాత్రమే

నీ  గురించిన భాద లేదు భవిష్యత్తు పై బెంగ తప్ప
  
మన అమ్మలో మరొక రూపం ఉంటుంది అది నువ్వు కొంచెం ఆనందం గా 

లేకపోయినా భాద పడుతూనే ఉంటుంది

అది అమ్మ ప్రేమ.....


కాని అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేని  చాలా మంది అనహరులు ఇప్పటికి 

ఈ భూప్రపంచం మీద ఉండటం ఇంకా సిగ్గు చేటు...

మిత్రులారా దేవుడు ప్రతి చోట ఉండడు అందుకే ప్రతి చోటా అమ్మను
సృషించాడు...

అమ్మ మనసుని భాదించకండి. ...
                                                                       
                                                             -నందు
Tuesday, October 02, 2012 - , 1 comments

గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు.

రవి అస్తమించని బ్రిటిష్  సామ్రాజ్యంలో దారే తెలియని చీకటిలో ఉన్న మన బారత దేశాన్ని తానే 
వెలుగై ఒక దిక్కును చూపి సత్యం అహింసా అనే అస్త్రాలతో ఆంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ఓ మహాత్మ....

మీ చల్లని దీవెన మాకివ్వు..!!
మీ దారిలో నడిచే బలమివ్వు...!!!
 మీకు మా తెలుగు వారి తరపున ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. 

                                                                         -నందు.