మనం జీవితంలో ఏదో కోల్పోతున్నాము,
శాస్త్రీయ విజ్ఞానంలో ఎంత వేగంగా అబి వృద్ది చెందుతున్నమో
మానవీయ విలువలను మాత్రం అంతకు మించిన వేగం తో అంతరించుకుంటున్నాము .
ఒక సారి గతం లోకి తిరిగి చూసుకుంటే..
కల్మషం లేని చిరునవ్వులు,
ప్రేమానురాగాలతో పెనవేసుకున్న బంధాలు,
అభిమానం, ఆప్యాయతలతో అలుముకున్న అనుబంధాలు,
కాఫీ కబుర్లతో కాలాన్ని మించిన కాలక్షేపాలు,
అంతేనా, ఇవన్నీ పై పెచ్చుకే......
కాని ఇదంతా ఒకప్పుడు
ఇప్పుడున్నదల్ల
పైపైకి ప్లాస్టిక్ నవ్వులు, రెడీమేడ్ బంధాలు,
డాలర్ల మోజులో దూరమైన అనుబంధాలు,
మాట్లాడే తీరిక లేక "మిస్ యు" అంటూ మెసేజులు,
కంప్యూటర్లతో కాపురాలు, మరయంత్రాలతో మీటింగులు...
ఇవేనా ఇంక ఎన్నెన్నో..!
ఎన్ని కోల్పోయినా
జీవచ్చవంలా బ్రతుకుతూ ప్రాణాలు కోల్పోకుండా మిగిలింది మన ప్రాణమొక్కటే ...
'కోట్ల'కు వెలకట్టలేని ఆస్తులను కోల్పోయాక
'పైసా'కి పనికిరాని ప్రాణమెందుకో ......
-నందు