Saturday, January 11, 2014 - , , , , , 2 comments

"1-నేనొక్కడినే"-కొత్తదనం కోరుకునే వారికే..!!!!




నేను సాధారణంగా సినిమాలకి రివ్యూలు రాయను, అది నా వృత్తి కాదు, ప్రవృత్తి కాదు...
కాని నేను చూసిన చాలా సినిమాలలో, అతి కొన్ని సినిమాలకే నా అభిప్రాయాన్ని రాస్తాను....
ఇప్పుడు కూడా అంతే...
చదవాలనిపిస్తే చదవండి లేదు అంటే అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోకండి...

ఇక ఇవాళ  రిలీజ్ అయిన
"1-నేనొక్కడినే" సినిమా ఎన్నో అంచనాలతో, విడుదలకి ముందే ఎన్నో రికార్డులు సృష్టించి ఇవాళ విడుదలైంది..
కథ విషయం పక్కన పెడితే, వందేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు అవే కథలు, సన్నివేశాలు, పాటలతో విసుగు చెందే సగటు ప్రేక్షకుడికి "1-నేనొక్కడినే"  లాంటి సినిమాలు కొంచం ఊరటనిస్తాయనుకోవటంలో సందేహం లేదు..
సుకుమార్ గారు కథను నడిపించిన విధానం,
నిజానికి అబద్దానికి మద్యలో ఏది నిజమో ఏది అబద్దమో అర్థం కాని కన్ఫ్యూషన్ లో బ్రతుకున్న ఒక యువకుడిగా మహేష్ బాబు గారి నటన బావుంది, అన్ని ఫ్రేముల్లో అతికినట్లు సరిపోయాడు, డాన్సులు కూడా బాగా చేసాడు,
ఇక పతాక సన్నివేశాల్లో వచ్చే సెంటిమెంట్ లో ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు...
ఆయన కుమారుడు గౌతమ్ బాగా చేసాడు....
దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం, నేపథ్య సంగీతం,
రత్నవేలు గారు కెమెరా పనితనం బాగున్నాయి...
చాలా మంది సినిమా నచ్చలేదు అని అంటున్నారట...
నచ్చలేదో లేక వారికి అర్థం కాలేదో ఇప్పటికి నాకు అర్థం కాలేదు...

మనకెప్పుడు 6 పాటలు, 4 ఫైట్లు,కామెడీ, ఇంకొంచం రొమాన్స్...
ఎపుడు ఇవేనా ???
అలాంటి సినిమాలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో సంవత్సరానికి 100కి పైగా వస్తున్నాయి...

మనందరికీ హాలీవుడ్ సినిమాలు నచ్చుతాయి డీవీడీలు కొనుక్కుని,
డౌన్లోడ్ చేసుకుని మరీ చూస్తాము,
ధూమ్ లాంటి సినిమాలో స్టంట్స్ చూసి మనవాళ్ళెందుకు తీయరు అని తెగ ఫీల్ అవుతాము,
మన వాళ్ళు ట్రై చేస్తే మాత్రం తేలికగా తీసేస్తాము...

"ఆరెంజ్" లో ప్రేమ కొన్ని రోజులే బావుంటుందని చెప్తే సినిమాని తీసేసాం,
"ఖలేజా" లాంటి సినిమాలో దేవుడే మనిషి రూపంలో వస్తాడు అంటే నవ్వి
 అలాంటి సినిమాలని ఫ్ల్లాప్ అని డిసైడ్ చేస్తాం...
మళ్ళి ఖలేజా ఒరిజినల్ మూవీని  యుట్యూబ్లలో మిగతా వాటిల్లో వెతుకుతాం....
మనకేలాగు సినిమాలు తీయటం రాదు, కనీసం చూడటం రాకపోతే ఎలాగు ??


కొత్తదనాన్ని కోరుకునే వాళ్ళు,
ముఖ్యంగా మహేష్ బాబు యాక్టింగ్ గాని డాన్సులు గాని మిస్ అవ్వదు అనుకుంటే ,
సుకుమార్ గారి స్క్రీన్-ప్లే చూడాలి అనుకునే వాళ్ళు చూడండి..

లేదు మాకు అవే కథలు, థ్రిల్లర్ సినిమాలు వద్దు అనుకుంటే
మాత్రం ఈ సినిమాకి వెళ్ళకండి
మీకు ఈ సినిమానే కాదు ఎలాంటి సినిమాలు చూసినా అర్థం కాదు...
ప్రేక్షకులు సినిమాని అర్థం చేస్కుంటే ఇది తెలుగు సినిమా స్థాయిని పెంచే సినిమా....

సగటు తెలుగు సినీ అభిమాని..... -నందు


2 comments:

Niru January 11, 2014 at 5:40 AM

మనకేలాగు సినిమాలు తీయటం రాదు, కనీసం చూడటం రాకపోతే ఎలాగు ??-- well said.....good one

నందు January 11, 2014 at 9:18 AM

Thank you niru garu...!!!