మళ్ళి మళ్ళి నిన్నే చూడాలనిపిస్తుంది

నిన్ను మొదటిసారి ఎప్పుడో చూసానో తెలియదు కాని 
చూసినప్పటి నుండి మళ్ళి మళ్ళి నిన్నే చూడాలనిపిస్తుంది 
ఒక్కసారైనా  నీతో మాట్లాడాలనిపిస్తుంది
నువ్వు నా సమీపాన చెరితే 
మనసు కంపిస్తుంది
గుండె తీవ్రత పెరుగుతుంది...  
నీ కళ్ళలో ఏ శక్తి దాచుకున్నావో గాని 
నన్ను మాత్రం శక్తిహీనుడ్నిచేస్తున్నాయి
ఇన్నేళ్ళుగా ఎలాంటి అలజడి లేని నాలో  
కొన్నాళ్లుగా నాలో నేనే లేని పరిస్థితి

నీ కోసం వెతుకుతున్నాయి నా కళ్ళు 
ఒక్క సారి కరుణించి వెళ్ళు
నీవెక్కడుంటావో తెలిసి కూడా 
ఏమి చేయలేని నిస్సహాయ స్థితి నాది 
ఒక్క సారి పలకరించి వెళ్ళు 
మళ్ళి  నాకు పునర్జన్మని ప్రసాదించి వెళ్ళు  

ప్రేమంటే ఏంటో తెలియని నాలో రేపావు అలజడి, 
మరి వినిపించట్లేదా ఈ గుండె సడి 
            -నందు 

ప్రేమ-నటన

మిత్రమా,
నువ్ నిజంగా ప్రేమిస్తున్నావో లేక 
ప్రేమిస్తున్నట్లు నటిస్తున్నావో 
నీకు నువ్వుగా తెలుసుకో...
ఎందుకంటే, 
ప్రేమిస్తున్నపుడు టైంపాస్ చేసినా టైంవెస్ట్ చేసినా 
బాగానే అనిపిస్తాయి... 
కాని నటిస్తున్నప్పుడే నరకంగా ఉంటుంది...!
కరక్టే, ప్రేమ పుట్టుక నీకు తెలియకపోవచ్చు
కాని పుట్టిన తర్వాతైనా తెలుస్తుందిగా ???
అందుకే నీకు నువ్వుగా మేల్కొను,
నటనని కట్టి పెట్టి నిజంలో బ్రతకటం మొదలెట్టు..!!! 
(నిజ జీవితంకి అడుగెట్టు)

                           -నందు

#నందు

జీవితం లోతు తెలియని సముద్రం..!!

జీవితం: 
లోతు తెలియని సముద్రం.
ఎత్తుకోలవలేని ఆకాశం..!!
జీవితం: 
రాజీ లేని పోరాటం.
అదొక అలుపెరగని పయనం..!!
జీవితం గురించి కొంత మందికి 
చదివితే తెలుస్తుంది
మరికొంత మందికి 
నిశితంగా పరిశీలిస్తే అర్థం అవుతుంది
కాని చాలా మందికి అనుభవిస్తేనే బోధపడుతుంది...
 -నందు



వద్దనుకున్నాక

ఒక్కసారి వద్దనుకున్నాక,  
దాని గురించి ఆలోచించటం మానేయాలి
అది వస్తువైనా, మనిషైనా.... 
-నందు.

ఓటమి కూడా సంతోషాన్నిస్తుంది

        కొన్నిసార్లు 
        ఓటమి కూడా సంతోషాన్నిస్తుంది, 
        బాధ కూడా బాగానే ఉంటుంది.  
        ఇష్టమైన వారి చేతిలో ఓడితే...!!!
                                 -నందు  

చరిత్రలో ప్రేమకథలు



చరిత్రలో కొన్ని ప్రేమకథలు వినటానికి బావుంటాయ్,
సినిమాల్లో కొన్ని ప్రేమ కథలు చూడటానికి బావుంటాయ్,
కథల్లో కొన్ని ప్రేమకథలు రాయటానికి బావుంటాయ్,
పుస్తకాల్లో కొన్ని ప్రేమ కథలు చదవటానికి బావుంటాయ్,
కాని నిజ జీవితంలో చాలా  ప్రేమకథలు వినకపోతేనే బావుంటాయ్, 
వాటి గురించి మాట్లాడుకోకపోతేనే మరింత బావుంటాయ్..
                                    -నందు







జీవితం-గెలుపు

గెలుపంటే ఏంటి ??

నీ విజయమా ? 
మరొకరి ఓటమా ??
యుద్ధంలో శత్రువుని చంపటమా ?? 
ఓడించటమా ?? 


జీవితమంటే ఏంటి ??

నువ్వు కోరుకున్నదా ? 
నువ్వు బ్రతకాలనుకున్నదా ? 
లేక ఇప్పుడు బ్రతుకుతున్నదా ??

ఇలాంటి ప్రశ మొదలై 
సమాధానం కొరకు అన్వేషణ మొదలైతే 
నీ జీవితంలో నీవు గెలిచినట్లే...!!!
-నందు




పదాలు ప్రేమగా-మాటలు మత్తుగా


Anandgoudpedduri



పదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మత్తుగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారు' మాట్లాడుతుంటే...
పదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మధురంగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారితో' మాట్లాడుతుంటే...
-నందు




నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు

నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు,
నీకేం తోచనపుడు,
నీకిష్టమైన వారితో మాట్లాడాలనిపించినపుడు,
ఆ మాట్లాడాల్సిన్న వ్యక్తి నీతో 
నీతో మాట్లాడే పరిస్థితిలో లేనప్పుడు, 
మాట్లాడాల్సిన వాటిని ఎక్కడైనా రాసి పెట్టు...
తర్వాత వాటిని చదివినపుడు 
అక్షరాలు అందంగా కనిపిస్తాయ్
పదాలు కూడా ప్రేమగా పలకరిస్తాయ్,
మాటలు ముత్యాల్లా మారతాయ్...
-నందు




సుఖం -సంతోషం

మనిషికి తను సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి 
కాని  సంతోషపడ్డ  క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి
                   -నందు