అంతులేని కథ

కొన్నాళ్ళ తర్వాత:
  
Continued last Post:

ఆమె:మళ్ళి కనపడనన్నావ్??
అతడు:మళ్ళి ఎందుకు మాట్లాడావ్  ??
ఆమె:అప్పుడు కోపం లో అన్నా..
అతడు:నేనప్పుడు బాధలో ఉన్నా
ఆమె: నువ్వేమి మారలేదు
అతడు: నువ్వు ఇంకా అలానే ఉన్నావ్
ఆమె: నీ మాటలు గుచ్చుకుంటున్నాయ్
అతడు: నీ జ్ఞాపకాలు గుచ్చుకుంటున్నాయ్
ఆమె:ఎన్నాళ్ళిలా బ్రతుకుతావ్ ??
అతడు:ఇలా బ్రతకలేనని తెలిసినతకాలం
ఆమె:....
అతడు:....


             -నందు

చాన్నాళ్ళ తర్వాత



చాన్నాళ్ళ తర్వాత::
ఆమె: ఎలా ఉన్నావ్ ??
అతడు:ఇంకా బ్రతికే ఉన్నా
ఆమె:నువ్వింకా గుర్తొస్తావ్ నాకు
అతడు: నేనింకా మర్చిపోలేదు నిన్ను
ఆమె:ఎందుకలా మాట్లాడుతున్నావ్ ?
అతడు: మరెలా మాట్లాడమంటావ్
ఆమె: నేనప్పుడు కావాలని వెళ్ళిపోలేదు
అతడు: కాని నేను కావాలనుకున్నపుడు వెళ్ళిపోయావు కదా
ఆమె: ఇప్పుడు నన్నేం చేయమంటావ్
అతడు:అది నన్నెందుకు అడుగుతున్నావ్  ?
అయినా ఆరోజు నన్నడిగే వెళ్ళిపోయావా
ఆమె: అప్పుడు నా జీవితం నా చేతిలో లేదు
అతడు:ఇప్పుడు మాత్రం నీ చేతిలో ఉందా ??
ఆమె:ఛ,నువ్వెప్పుడు ఇంతే ఎప్పటికి అర్థం చేసుకోవు
అతడు:అవును నేనప్పటికి అర్థం కాను నీకు.
ఆమె: ఇంకోసారి మాట్లాడను
అతడు: నేనుకూడా ఇంకోసారి కనపడను...
                                           -నందు                              

Inspired by one of my Facebook friends

                                                         (ఇంకా ఉంది)
                               
Thursday, March 26, 2015 - , , , , 0 comments

జీవితం ఒక ఆట

గెలిచినపుడు సంతోషించటం...,
ఓడినపుడు బాధపడటం..., 
గెలుపుని ఆస్వాదించినపుడు 
ఓటమిని కూడా ఓర్చుకోవాలి, 
బాధని తట్టుకోనగలగాలి...
అది ఆటలోనైనా... 
జీవితంలోనైనా... 
ఆటకి వ్యవధి, గడువు ఉంటుంది
జీవితానికే నిర్దిష్ట వ్యవధి ఉండదు
అంతే తేడా..

కాలం చెల్లినపుడు కనుమరుగవటమే...

గెలుపు, ఓటమి కంటే పోరాడటం ముఖ్యం 
గడువు తీరేవరకు...
గమ్యం చేరేవరకు...
                         -నందు




Tuesday, March 17, 2015 - , , , 0 comments

జీవితం

"జీవితం" సమాధానం దొరకని ఒక  ప్రశ్న
"జీవితం" సమాధానం తెలుసుకోవాల్సిన ఒక  ప్రశ్న
                                                  -నందు

Wednesday, February 04, 2015 - , , , , 1 comments

ప్రేమకు మరోవైవు


నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడు
వారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్ని ప్రేమించగలగాలి,
తప్పుల్ని క్షమించగలగాలి,
వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు 
వారి కోపాల్ని కూడా భరించగలగాలి,
వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి
ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా తోడుండాలి
ప్రేమించబడటమే కాదు మనం కూడా ప్రేమతో ప్రేమించగలగాలి...
ఇవన్ని మన వల్ల కాలేకపోతే మనం ఎదుటివారిని  
ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి
-నందు

నీలో ఉన్న "నా" మనసునడుగు

మనం చూసే కళ్ళు కూడా
ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయేమో గాని
మన మనసెప్పుడు మోసం చేయదు...
నేను నిన్ను చూసింది మనసుతోనే కాని కళ్ళతో కాదు
నీకింకా నమ్మకం లేకపోతే
నీతో ఉన్న "నీ" కళ్ళనడుగు
నీలో ఉన్న "నా" మనసునడుగు
నాపై ఉన్న "నీ" ప్రేమనడుగు
-నందు



Saturday, January 03, 2015 - , , , , 0 comments

అడగటానికి అడ్రెస్ కూడా దొరకకుండా వెళ్ళిపోతారు

అనుమతి లేకుండానే చాలా మంది 
మన జీవితంలోకి వస్తారు
ఉన్నంతకాలం మనతో భానే ఉంటారు...
ఉన్నట్టుండి ఏమవ్తుందో తెలియదు
మనకి చెప్పకుండానే,
వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోతారు...
మనతో వారికేం సంబంధం లేనట్లు,
మనమెవరో వారికి తెలియనట్లు....

అడగటానికి అడ్రెస్ కూడా దొరకకుండా

వెతకటానికి వీలు పడకుండా 
                      -నందు 


Wednesday, December 31, 2014 - 0 comments

నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని
కొత్త ఆశలు ఆశయాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
-నందు




Thursday, December 25, 2014 - , , , , 2 comments

కోరిక-తీరిక

కూర్చుని మాట్లాడితే
చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది
కాని కూర్చోవాలనే కోరిక
మాట్లాడాలనే మక్కువ లేకే
చాల విషయాలు గోడవలకి,
విభేదాలకి దారి తీస్తాయి
-నందు
Friday, December 19, 2014 - , , , , , 0 comments

స్వీయానుభవంతో తెలుసుకోవలసిందే...!!!

సముద్రంలో ఉండే చేప కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు,
ఒక వేళ అవి కనిపించినా ఎవరికీ అర్థం అవ్వవు...
మనిషి జీవితం కూడా అంతే
ప్రతి మనిషికి కన్నీళ్ళు, బాధలు ఉంటాయి...
కాని ఆ కన్నీళ్ళ వెనకాల కారణాలు
ఎవ్వరికి కనిపించవు,
ఒక వేళ కనిపించినా
వారి కష్టాలు ఎవ్వరికి అర్థం అవ్వవు...
ఏవైనా స్వీయానుభవంతో తెలుసుకోవలసిందే...!!!
                                      -నందు