Friday, October 24, 2025 - 0 comments

ఇంట్లో దేవుడే ఉండడంటావా

 గుడిలో దేవుడి ముందు 

దేవుడా నేను బాగుండాలి 

నాకు అది రావాలి ఇది కావాలి అని 

కోరికలు,బాధలు చెప్పుకుంటాం.. !

 

కానీ ఇంటికి వచ్చాక 

వాడు బాగుపడ్డాడు 

వీడు లాభపడ్డాడు 

అది సంపాదించాడు 

ఇది కొన్నాడు అని ఏడుస్తాం 

గుడిలో నీ మాటలు వినే దేవుడు

ఇంట్లో మాత్రం వినడంటావా 

లేక ఇంట్లో దేవుడే ఉండడంటావా??

-నందు