కాలం చెప్పే సమాధానం చాలా గట్టిది


ఎవరెన్ని వేషాలేసినా
ఎవరెన్ని వెకిలి చేష్టలు చేసినా
ఎవరెన్ని నీతులు చెప్పినా
ఎవరెన్ని గోతులు తీసినా
ఎవరెన్ని కుట్రలు పడినా
ఎవరెన్ని కథలు చెప్పినా
ఎవరెన్ని కథలు పడినా
నీ ముందు నవ్వుతూ మాట్లాడి 
వెనకాల ఎన్ని గోతులు తీసినా
ఎవడెంత చులకనగా చూసినా
ఎవడెంత స్వార్థంగా మారినా
కొన్ని సార్లు మౌనంగా ఉండటం మంచిది
ఎందుకంటే కాలం చెప్పే 
సమాధానం చాలా గట్టిది
- నందు