Monday, September 11, 2023 - 0 comments

లోగుట్టు పెరుమాళ్ళకెరుక ...!!!

 ॥ నందు॥ 19.04.2023॥ 

 మాటలతో మార్చే వాళ్ళు, 

మనుషుల్ని ఏమార్చే వాళ్ళు, 

రెచ్చగొట్టే వాళ్ళు, చిచ్చు పెట్టే వాళ్ళు, 

 ఒకరి మీద పడి ఏడిచే 

 వాళ్ళున్న సమాజంలో ఉన్నాం మనం 

మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి 

 ఏది నిజమో, ఎది అబద్దమో, 

అసలు నిజమేదో తెలుసుకోగలగాలి 

ఎవరూ ఎలాంటి వాళ్ళు, 

ఎవరూ ఎలా ఉంటారు 

అనే బేరీజు వేసుకొగలగాలి 

 ఇవాళ నిన్ను రెచ్చగొట్టే వాడు 

 నీ అవసరం తీరాక, 

 లేక నీతో పొసగక 

రేపు నీమీదికే ఇంకొకరిని 

 రెచ్చగొట్టడన్న నమ్మకం లేదు 

నీతో ఇన్నాళ్లు ప్రేమగా మాట్లాడేవాడు, 

 నీ ఏడుపును కోరుకోడు 

 అన్న నమ్మకం లేదు 

 జరుగున్న మార్పులను 

 గమనిస్తూనే ఉండాలి 

ఎదుటి వారి మీద మనకంటూ 

ఒక నిర్దిష్ట అభిప్రాయం 

ఏర్పరచుకోవాలి 

 రెచ్చగొట్టగానే రెచ్చిపోవద్దు 

కన్నీరు కార్చగానే కరిగిపోవద్దు 

ఏ మాట వెనకాల 

 ఏ అవసరం ఉందో 

ఏ పలకరింపు మాటున 

 ఏ పెను విషాదం దాగుందో 


 లోగుట్టు పెరుమాళ్ళకెరుక !!

-నందు

Thursday, July 27, 2023 - 0 comments

ఇరుకిల్లు

ఇంట్లో అర్థం చేసుకునే మనుషులు,
సర్దుకుపోయే గుణాలుంటే
ఇరవై మందితో కలిసున్నా బాగానే ఉంటుంది,
ఇరుకిల్లు కూడా ఇంద్రభవనంలాగే ఉంటుంది.

కానీ ఇరుకు మనుషులుంటే
ఇద్దరున్న ఇంద్రభవనం కూడా
దాని తేజస్సుని కోల్పోతుంది.
నీకెన్ని ఆస్తులున్నా,
అంతస్తులున్నా 
అనాధగానే బ్రతకాల్సి వస్తుంది 
-నందు

నేటి బంధాలు