నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు

నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు,
నీకేం తోచనపుడు,
నీకిష్టమైన వారితో మాట్లాడాలనిపించినపుడు,
ఆ మాట్లాడాల్సిన్న వ్యక్తి నీతో 
నీతో మాట్లాడే పరిస్థితిలో లేనప్పుడు, 
మాట్లాడాల్సిన వాటిని ఎక్కడైనా రాసి పెట్టు...
తర్వాత వాటిని చదివినపుడు 
అక్షరాలు అందంగా కనిపిస్తాయ్
పదాలు కూడా ప్రేమగా పలకరిస్తాయ్,
మాటలు ముత్యాల్లా మారతాయ్...
-నందు




సుఖం -సంతోషం

మనిషికి తను సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి 
కాని  సంతోషపడ్డ  క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి
                   -నందు
                                  

సమాధానం లేని ప్రశ్న

అన్ని ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేం, తెలుసుకోలేం..  
కొన్నింటికి కాలం, మరికొన్నింటికి మౌనం,
మాటలతో చెప్పలేని వాటికి మనసు   
ఇంకోన్నింటికి నీ జీవితం... 
ఇలా ఏదో ఒక విధంగా సమాధానం దొరుకుతూనే ఉంటుంది..  
అసలు సమాధానం లేని ప్రశ్నే లేదు ఈ  విశ్వంలో...!!! 
సమాధానం దొరకలేదంటే, 
నీకు సమయం సరిపోకపోయి ఉండాలి లేదా 
దాని మీద నీకు ఆసక్తి లేకుండా ఉండి ఉండాలి 
ఈ రెండు కాదంటే అదసలు ప్రశ్నే కాకపోయి ఉండాలి 
                                   -నందు