ఎదురుచూపులో ప్రేముంటుందా ???

ఎదురు చూపులో  ప్రేముంటుందా....!!!

సైన్యంలో పనిచేసే కొడుకు కోసం తల్లిదండ్రులు/భర్త కోసం భార్య ఎదురుచూస్తుంటారు. 

ఎప్పుడు తనోస్తాడో లేక, 
ఏ వార్త వినాల్సి వస్తుందోనని.... 

రోజు వచ్చే సమయానికి మనం ఇంటికి రాకపోతే కంగారు పడి,

మనకి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటారు, అదే ప్రేమంటే... 

రోజు సాయంత్రం ఆరింటికి నీవస్తావని తెలిసికూడా,

ఐదున్నరకే గుమ్మం వైపు చూస్తుంటుంది నీ భార్య, అదే ప్రేమంటే...

ఎక్కడో ఇంటికి దూరంగా మనకోసం పని చేసే నాన్న

నెలకోసారి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు 
మళ్ళి ఎపుడోస్తాడని ఎదురుచూస్తుంటాం 
ఆ ఎదురుచూపే ప్రేమ...  

నిన్నంతా మనతోనే ఉన్న మనం ప్రేమించిన అమ్మయికోసమో/ అబ్బాయికోసమో 

అందరికంటే ముందుగా క్లాసు కి వెళ్లి తనకోసమే ఎదురుచూస్తుంటాం... 
అదే ఎదురుచూపులో ప్రేమ...!!!

లోకం నింద కోసం సీతని అడవుల్లోకి పంపి, 

సీత కోసమే పరితపించాడు రాముడు
తనెక్కడుందో తెలిసి కూడా చూడటానికి వెళ్ళలేదు... 
ప్రేమ లేకనో, ఇష్టం లేకనో కాదు, 
సమయం, పరిస్థితులు అనుకూలించక. 
సీత కోసం రాముడు, శ్రీరాముడి కోసం సీత...  
ఇలా ఒకరికొకరు ఎదురు చూస్తూ ఉండిపోయారు, 
ఇదేనేమో ఎదురు చూపుల్లో ప్రేమంటే....  

నేను రాముడంత గొప్పవాడిని కాదు కాని, నీవెప్పుడు నా సీతవే...  


కేవలం నీకిచ్చిన మాటకోసం, 

నీవెక్కడుంటావో తెలిసి కూడా,
రెండు నెలలుగా నాతో నేను నిశబ్ధ యుద్ధం చేస్తూ,
అనవసరమైన వాటిని కూడా భరిస్తూ,
నీకోసం, కేవలం నీ మాట వినటం కోసమే 
ఎదురు చూస్తున్న నేను...
                    -నందు



                                     






జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను...!!!


జీవితంలో పెళ్ళే చేసుకోవద్దనుకున్నాను,

కాని నిన్ను చూసాక, నీతో పరిచయం అయ్యాక 

నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోవద్దని నిర్ణహించుకున్నాను

అంతలా మారిపోయేలా చేసావు, 

ఎప్పుడు ఇలాంటి అమ్మాయి, అలాంటి అమ్మాయి
అవి, ఇవి అని ఏ క్వాలిఫికేషన్స్  పెట్టుకోలేదు...

నిన్ను చూసినప్పటి నుండి నేను పెట్టుకున్న క్వాలిఫికేషన్స్  అన్ని నువ్వే...

అన్నింట్లోను  నువ్వెలా ఉన్నావో అలానే ఉండాలనుకున్నాను 

నా జీవితం లో ఇంతగా ప్రేమించిన ప్రేమిస్తున్న జీవితాంతం ప్రేమించే ఏకైక వ్యక్తివి 

నువ్వే  చెలీ ...

నిన్ను తప్ప ఇంకేవ్వరిని ఊహించుకోలేను కూడా... 
              
నీకోసం ఎదురుచూస్తున్న నేను                     -నందు 

Wednesday, October 08, 2014 - , , , , 2 comments

నీకెప్పుడైనా చావాలనిపించిందా ??

నీకెప్పుడైనా చావాలనిపించిందా ??
ప్రతి చిన్న విషయానికి చావే పరిష్కారం కాకూడదు
ఏమో నీ సమస్య పెద్దదే కావచ్చు, 
కాని చావుకంటే పెద్ద సమస్య లేదేమో ఈ భూమ్మీద...!!!

బ్రతకటానికి ఏ దారైనా దొరుకుతుంది
కాని సమస్యోచ్చినపుడల్లా చావే రహదారి కాకూడదు
ప్రతి చిన్న బాధకి, నొప్పికి చావే మందు అయితే
నువ్వీ భూ ప్రపంచం మీదికి వచ్చేవాడివి కాదేమో...!!!
ఎందుకంటే ప్రసవ వేదనను భరించలేక నీ కన్న తల్లి అప్పుడే చనిపోయేదేమో...!!!
బాధను భరించు అప్పుడే జీవితం విలువ తెలుస్తుంది
బ్రతకాలనే ఆశను బ్రతికిస్తూ, 
చావాలనే కోరికను చంపేస్తు బ్రతుకు....!!!
-నందు

మిత్రుడి మరణానికి నివాళీగా....