Sunday, January 15, 2012 - 5 comments

ప్రేమ ఎం కోరుకుంటుంది ?




ఈ భూమంతా 'ప్రేమే'..
భూమి తన చుట్టూ  తను తిరుగుతున్నపుడు మనుషులు పడిపోవాలి కదా
అలా మనుషులు  పడిపోకుండా ఒకళ్లనోకళ్ళని కట్టి పడేసేది 'ప్రేమ'...
మనం చదువుకున్న సైన్సు ప్రకారం  అది గురుత్వాకర్షణ శక్తి కాకపోతే సమ్మోహన శక్తి, ఆకర్షణ శక్తి ...
 ఏదైన అనండి
 'ప్రేమ' కూడా ఒక రకపు శక్తియే కదా....?
ప్రేమ ప్రేమే..

మరి ఇంత గొప్ప శక్తి ఇముడ్చుకున్న 'ప్రేమ' నిజంగా ఎం కోరుకుంటుంది ?

 'ప్రేమ' సుఖాన్ని , సంతోషాన్ని కోరుకుంటుందా లేక
'ప్రేమ' పెళ్లిని కోరుకుంటుందా ?
ఇవి కాకుండా  యాసిడ్ దాడులను, రక్తపు మడుగులను కోరుకుంటుందా ?
చాలా మంది అంటుంటారు 'ప్రేమ' త్యాగాని కోరుకుంటుందని ...మరి ఇదే నిజమా ?
మరేంటి ?

నేస్తం 'ప్రేమ' వీటన్నింటిని కోరుకోదు
ప్రేమ 'ప్రేమ'నే కోరుకుంటుంది
 అర్థం చేసుకునే  హృదయాన్ని
మనకోసం ఆరాట పడే ఒక చిన్ని గుండెని...
అందుకే ప్రేమని ప్రేమతో  ప్రమకోసం ప్రేమించు  స్వార్థం కోసం కాదు...
ప్రేమని ప్రేమతో ప్రేమించి ప్రేమించబడు... 

-నందు