జీవితం లోతు తెలియని సముద్రం..!!

జీవితం: 
లోతు తెలియని సముద్రం.
ఎత్తుకోలవలేని ఆకాశం..!!
జీవితం: 
రాజీ లేని పోరాటం.
అదొక అలుపెరగని పయనం..!!
జీవితం గురించి కొంత మందికి 
చదివితే తెలుస్తుంది
మరికొంత మందికి 
నిశితంగా పరిశీలిస్తే అర్థం అవుతుంది
కాని చాలా మందికి అనుభవిస్తేనే బోధపడుతుంది...
 -నందువద్దనుకున్నాక

ఒక్కసారి వద్దనుకున్నాక,  
దాని గురించి ఆలోచించటం మానేయాలి
అది వస్తువైనా, మనిషైనా.... 
-నందు.

ఓటమి కూడా సంతోషాన్నిస్తుంది

        కొన్నిసార్లు 
        ఓటమి కూడా సంతోషాన్నిస్తుంది, 
        బాధ కూడా బాగానే ఉంటుంది.  
        ఇష్టమైన వారి చేతిలో ఓడితే...!!!
                                 -నందు  

చరిత్రలో ప్రేమకథలుచరిత్రలో కొన్ని ప్రేమకథలు వినటానికి బావుంటాయ్,
సినిమాల్లో కొన్ని ప్రేమ కథలు చూడటానికి బావుంటాయ్,
కథల్లో కొన్ని ప్రేమకథలు రాయటానికి బావుంటాయ్,
పుస్తకాల్లో కొన్ని ప్రేమ కథలు చదవటానికి బావుంటాయ్,
కాని నిజ జీవితంలో చాలా  ప్రేమకథలు వినకపోతేనే బావుంటాయ్, 
వాటి గురించి మాట్లాడుకోకపోతేనే మరింత బావుంటాయ్..
                                    -నందుజీవితం-గెలుపు

గెలుపంటే ఏంటి ??

నీ విజయమా ? 
మరొకరి ఓటమా ??
యుద్ధంలో శత్రువుని చంపటమా ?? 
ఓడించటమా ?? 


జీవితమంటే ఏంటి ??

నువ్వు కోరుకున్నదా ? 
నువ్వు బ్రతకాలనుకున్నదా ? 
లేక ఇప్పుడు బ్రతుకుతున్నదా ??

ఇలాంటి ప్రశ మొదలై 
సమాధానం కొరకు అన్వేషణ మొదలైతే 
నీ జీవితంలో నీవు గెలిచినట్లే...!!!
-నందు
పదాలు ప్రేమగా-మాటలు మత్తుగా


Anandgoudpedduriపదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మత్తుగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారు' మాట్లాడుతుంటే...
పదాలు ప్రేమగా ఉంటాయ్, 
మాటలు మధురంగా ఉంటాయ్ 
ఇష్టమైన 'వారితో' మాట్లాడుతుంటే...
-నందు