Monday, June 03, 2019

గతం తాలూకు జ్ఞాపకాలు...!!!!



ఎన్నేళ్ళయిందో మనిద్దరం కలిసి 
కానీ నిన్ననే చూసినట్లుంది 
ఎం మాట్లాడామో గుర్తురావట్లేదు 
కానీ ఇందాకే పలకరించినట్లుంది 
నీ సాంగత్యం  కోసం ఎదురు చుసిన బస్టాండ్లు
కాలేజీలోని జ్ఞాపకాలింకా 
కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయ్..
నీతో  మాట్లాడుకుంటూ మీ వీధి చివరకొచ్చి
వాటిని  తల్చుకుంటూ నాలోనేను నవ్వుకుంటూ,
వెనక్కి  వచ్చిన  క్షణాలు వెక్కిరిస్తూనే ఉన్నాయ్..
అన్నేళ్ల మన పరిచయంలో
ఎన్ని పోట్లాటలొచ్చినా 
మన ప్రేమ ముందు ఓడిపోతూనే
 మనల్ని  గెలిపించాయి..
ప్రేమ కన్నా పరువే ముఖ్యమని 
మీ ఇంట్లో వాళ్ళు నన్ను మర్చిపొమ్మని 
నిన్ను బాధపెట్టినప్పుడు 
నువ్వు  పడిన నరకయాతన  నేనూహించగలను...
ఎలాగైనా మర్చిపోవాలని వాళ్ళన్నపుడు,
ఎలా మర్చిపోవాలని నువ్వు నాకు దూరమైనప్పుడు 
నాతో  బంధాన్ని తెంచుకుని నువ్వా బందీకానలో
మగ్గి నన్ను పూర్తిగా మర్చిపోయినపుడు,
మర్చిపోలేనంతగా ఏకమైన మన మనసుల 
జ్ఞాపకాల తాలూకు గాయాలు  వెంటాడుతున్నా,
నీతో  మాట్లాడిన  చివరి  క్షణమే  
చివరదని ఊహించని  నా పిచ్చిమనసు  
నిన్నింకా మర్చిపోకుండా ప్రేమిస్తూ 
నీ జ్ఞాపకాల్లో బ్రతికేస్తుంది 
నువ్వు లేని ఇన్నేళ్ల నా జీవితంలో 
నేనెంత సంతోషంగా ఉన్నా 
ఆనందాన్ని నీతో పంచుకోలేక 
నరకం అనుభవిస్తున్నా ప్రియా...!!!

ఇట్లు  
ఎప్పటికి  నిన్ను  ప్రేమించే  నీ కార్తిక్

-నందు 

పి. యస్ : ఇది నేను రాస్తున్న  నవలలోని ఒక  లేఖ 
Date :11-01-18

1 comment:

  1. మంచి పోస్ట్ పంచుకున్నందుకు ధన్యవాదాలు.
    Latest Telugu News
    Andhra Pradesh Telugu News

    ReplyDelete