నీకేం భావుంటావ్ ఎందుకంటే నేనున్నాను కదా నీకు...! (అని నేననుకుంటాను కాని, నువ్వే నన్ను కంటికి రెప్పల చూసుకుంటావని నేనెప్పుడు అనుకోను )
సృష్టిని సృష్టించిన సృష్టి కర్తవి నీవు
ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన ప్రేమ మూర్తివి నీవు
మా స్వార్థం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసిన త్యాగ మూర్తివి నీవు
నాకు చాలా సార్లు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనిపించింది,
కాని నేను చెప్పేలోపే నీకు నేనంటే ఇంత ఇష్టమో నా మీద నీకెంత ప్రేముందో చూపిస్తావు చూడు ఆ ప్రేమ ముందు నా చిన్ని ప్రేమ బలాదూర్ అనిపిస్తుంది అందుకే నాకెప్పుడు చెప్పాలనిపించదు
నేనే తప్పు చేసినా నన్నే వెనకేసుకోస్తావు చూడు, ఆ ప్రేమను చూసి నాలో గర్వం మరింత పెరుగుతుంది..
నా మనసులో ఏముందో నాకే అర్థం కాదు అలాంటిది, నేను ఎపుడైనా ఏదైన మనసులో అనుకునే లోపే చేసి పెడతావు
డాక్టర్ కంటే ముందుగా నా మౌనాన్ని పసిగాడతావు
నేను ఎప్పుడైనా నీతో మాట్లాడామని ఫోన్ తీసి నెంబర్ నొక్కుతుంటే నాకన్నా ముందే నువ్వే ఫోన్ చేస్తావు (నాకు ఇప్పటికి ఆశర్యమే నువ్ నా గుంచి ఆలోచిస్తావని కాని నువ్వు నా కోసమే బ్రతుకుతున్నవని నేను ఇంకా అర్థం చేసుకోను ఎందుకని )
నువ్ గెలుస్తావ్ కన్నా... అని నా నుదిటి మీద ముద్ధాడుతావ్ చూడు
ఆ ముద్దు నా గెలుపుకి మూలం అని అనుకోను నేను...
ఆ ముద్దు నా గెలుపుకి మూలం అని అనుకోను నేను...
నీ గురించి ఎంత రాసుకున్న, ఎంత మాట్లాడుకున్న
నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది
నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది
అదే నీకోసం ఎం చేయలేదనే బాధ...
ఇలాంటి ఉత్తరాలు ఇప్పటికి చాలా సార్లు రాసాను కాని
నీకు పంపించాలనిపించదు
నీకు పంపించాలనిపించదు
ఎందుకంటే నా మనసునే చదివేసావు కదా
ఈ ఉత్తరంలో ఎం రాసానో ఈపాటికే నీకు తెలిసిపోయి ఉంటుందనే....
ఈ ఉత్తరంలో ఎం రాసానో ఈపాటికే నీకు తెలిసిపోయి ఉంటుందనే....
-నీ నందు

This comment has been removed by the author.
ReplyDeletegreat thought
ReplyDeleteఅమ్మ అంత గొప్పగా ఉంది..అమ్మకి వ్రాసిన లేఖ. ఏ తల్లికైనా బిడ్డ తరువాతనే ఏదైనా.. కానీ బిడ్డలకి.. కష్టం కల్గినప్పుడే అమ్మ ... అమ్మ ప్రేమ గుర్తుకు వస్తుంది... బాగుంది.మీ లేఖ
ReplyDeleteఇంట్రెస్టింగ్!
ReplyDeleteఅమ్మకి ఉత్తరం...ఆలోచనే ఎంత బాగుందో!
ఏమిచ్చినా అమ్మ రుణ తీర్చుకోలేము కదా!
ఇందు గారు చాల థాంక్స్ అండి నిజంగా ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోలేము అయిన అమ్మ మన నుండి ఏమి ఆశించదు..
ReplyDeleteTHOTAKURI SRINIVAS GAARU, వనజ వనమాలీ గారు థాంక్స్ అండి..
ReplyDeleteprati okkariki idi anubhavamaina mee laga rastene oka santosham ive naa feelings kuda ani....bagundi....amma eppudu amme
ReplyDeleteలక్ష్మి గారు ధన్యవాదములు....
ReplyDeleteపెదవె పలికె మాటల్లొ తీయని మాటె అమ్మ....
ReplyDeleteఅలాంటి అమ్మ కు మీ మనసులొ బావలు అక్షర రూపం లొకి పెట్టక మునుపె మిమ్మలిని చదెవెయగలదు .అమ్మ ఎప్పటికి అమ్మె ....
పెదవె పలికిన మాటల్లొ తీయని మాటె అమ్మ ....
ReplyDeleteఅలాంటి అమ్మ కు మీ భావాలు అక్షర రూపం లొ పరుగులు తీయక ముందె ..మీ ప్రెమ అమ్మకు తెలుస్తునె ఉంటుంది ..
పెదవె పలికిన మాటల్లొ తీయని మాటె అమ్మ ...
ReplyDeleteఅలాంటి అమ్మకు,
మీలొని బావాలకు అక్షర రూపం ఇవ్వటం అమ్మకు నిజ్జం గానె ఎంత అపురూపం ..ఈ సారి అమ్మకు ఆ అక్షరాలను అందచెయండి ...
thank you andi vyshu garu...!!!
ReplyDeleteచాలా బాగుంది .
ReplyDeleteMutyam garu thank you
ReplyDelete