మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విలువలు,
ఉల్వలు అంటూ మాట్లాడకూడదు
మనిషికి ఇచ్చే విలువ
ఎప్పుడు ఒకేలా ఉండాలి
స్థాయిని బట్టి,
డబ్బుని బట్టి మారకూడదు
-న💚దు
నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది. నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్.... మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు