Wednesday, March 12, 2014

నా డైరీ కాలిపోతోంది..!!!






నా డైరీ  కాలిపోతోంది, 

నాకు మాత్రమే తెలిసిన కొన్నింటిని నలుగురితో పంచుకోవటం లేక...
మరుగునపడి ఉన్న మర్మాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  

నా డైరీ  కాలిపోతోంది,
అనవసరమైన  మొహాలను, సందర్భాలను గుర్తుచేయటం ఇష్టం లేక...  
నా డైరీ  కాలిపోతోంది,
గతంలోని జ్ఞాపకాలను మళ్ళి మళ్ళి గుర్తుచేసి గాయాన్ని 
మరింత పెద్దవిగా చేయటం ఇష్టం లేక... 
నా డైరీ మండుతుంది నా గుండె మంటల్ని చల్లార్చటానికి... 

నా డైరీ మంటల్లో మండుతోంది,
అప్పట్లో 'నేను ' ని ఇప్పటి 'నా'తో పోల్చటం ఇష్టం లేక  
నన్ను నన్నుగా ఉంచటం కోసం.... 
అవును నా ఆత్మ బంధువు  తన ఆత్మనోదిలి 
అనంత లోకాల్లో కలిసిపోతోంది...

నా డైరీ కాలిపోతోంది 
మళ్ళి నాతో డైరీ రాయించటం కోసమేమో...!!!
                                      -నందు  

2 comments: