నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు

నువ్ ఒంటరిగా ఉన్నప్పుడు,
నీకేం తోచనపుడు,
నీకిష్టమైన వారితో మాట్లాడాలనిపించినపుడు,
ఆ మాట్లాడాల్సిన్న వ్యక్తి నీతో 
నీతో మాట్లాడే పరిస్థితిలో లేనప్పుడు, 
మాట్లాడాల్సిన వాటిని ఎక్కడైనా రాసి పెట్టు...
తర్వాత వాటిని చదివినపుడు 
అక్షరాలు అందంగా కనిపిస్తాయ్
పదాలు కూడా ప్రేమగా పలకరిస్తాయ్,
మాటలు ముత్యాల్లా మారతాయ్...
-నందు




సుఖం -సంతోషం

మనిషికి తను సుఖపడ్డ క్షణాలు కొన్ని రోజులే గుర్తుంటాయి 
కాని  సంతోషపడ్డ  క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి
                   -నందు
                                  

సమాధానం లేని ప్రశ్న

అన్ని ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేం, తెలుసుకోలేం..  
కొన్నింటికి కాలం, మరికొన్నింటికి మౌనం,
మాటలతో చెప్పలేని వాటికి మనసు   
ఇంకోన్నింటికి నీ జీవితం... 
ఇలా ఏదో ఒక విధంగా సమాధానం దొరుకుతూనే ఉంటుంది..  
అసలు సమాధానం లేని ప్రశ్నే లేదు ఈ  విశ్వంలో...!!! 
సమాధానం దొరకలేదంటే, 
నీకు సమయం సరిపోకపోయి ఉండాలి లేదా 
దాని మీద నీకు ఆసక్తి లేకుండా ఉండి ఉండాలి 
ఈ రెండు కాదంటే అదసలు ప్రశ్నే కాకపోయి ఉండాలి 
                                   -నందు 


మనుషుల్ని, విలువల్ని సంపాదించటం కూడా...!!!



సంపాదించటం అంటే కేవలం డబ్బునే కాదు

మనుషుల్ని, విలువల్ని సంపాదించటం కూడా...!!!

కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించటం, 

ఆపదలో ఆదుకునే వారిని సంపాదించటం,

బాధల్లో ఉన్నప్పుడు దైర్యాన్ని నింపే వారిని,

మన కోపాల్ని అర్థం చేసుకునే వారిని సంపాదించటం....!!!

ఇవన్ని సంపాదించుకోలేని వాడు కష్టపడి కోట్లు కూడబెట్టినా  

అవి కొన్ని సార్లు దేనికి పనికి రావు... 

-నందు
Sunday, April 19, 2015 - , , , , 0 comments

ఓకే బంగారం

ఓకే బంగారం:

వయసుతో పనిలేకుండా 

ప్రేమలో ఉన్న వాళ్ళు, 
ప్రేమలో పడ్డవాళ్ళు, 
ప్రేమలో గెలిచిన వాళ్ళు,.
తప్పకుండా చూడాల్సిన సినిమా...!!!
లివింగ్ రిలేషన్షిప్ పై నేటి యువత తీరుని ప్రధానంగా తీసుకుని,
ప్రేమకి,వ్యామోహానికి మధ్యలో ఒకచిన్న నిజాయితిని సృష్టించి....
ఫారెన్ లోకేషన్లు, పెద్ద పెద్ద ఫైట్లు లేకుండా తీసిన ఒక ఒక రిచ్ సినిమా...
సినిమా పై మనసుపెట్టి చూడండి
మణిరత్నం కనిపిస్తాడు, 
ఏఆర్ రహమాన్ కురిపిస్తాడు(సంగీతం), 
పిసి శ్రీరాం మెరిపిస్తాడు(ఛాయాగ్రహణం)..
ఒకే ఫ్రేములో రెండు ప్రేమ కథలను నడిపించటం...
నిత్య ఇంకా అందంగా కనబడింది, ఇంకొన్నాళ్ళు యువ ప్రేమికుల గుండెల్లో 
నిండి ఉంటుందనడంలో సందేహం లేదు..
మంచి ఫీల్ ఉన్న సినిమా,
మంచి ఫీల్ ని కలిగించే సినిమా ...!!! 
కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తాయ్, 
ఇంకొన్ని జ్ఞాపకాలు వెంటాడతాయ్, 
కాని మళ్ళి ఇంకొన్ని జ్ఞాపకాలు మిగిలిపోతాయ్. 

చరిత్రలో ప్రేమ కథలెప్పుడు హిట్టే, 

కాని చూపే విధానంలో, తీసే విధానంలో 
చాలా మంది ఫెయిల్ అవ్తున్నారు...
ఈ సినిమా "ఓకే" కాదు చాలా చాలా "ఓకే"

p.s:రెగ్యులర్ రొటీన్, మాస్ సినిమాలు చూసే వారికిది నచ్చదు..

థియేటర్ కి వెళ్లి టైం వెస్ట్ చేసుకోకండి..         
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం  
        
                     -నందు