Wednesday, September 10, 2014 - , , , , , 0 comments

ఆశ-నిరాశ



నా ఫోన్ మ్రోగిన ప్రతిసారి అది నువ్వేనేమోనన్న ఆశ,
మెసేజ్ వచ్చిన ప్రతిసారి నువ్వేనన్న భరోస...
కాని నా ఆశేప్పుడు నిరాశే అవ్తుంది
మాట్లాడటం మానేస్తే మరచిపోతానని నువ్వనుకుంటున్నావు
నీ మాటకోసం ప్రతిక్షణం మరణిస్తున్నానని ఎప్పుడు తెలుసుకుంటావు ??
-నందు


Saturday, August 23, 2014 - , , , , , 3 comments

మనుషులు-మనసులు



కొన్ని జ్ఞాపకాలు మనుషుల్ని గుర్తుచేస్తే 
ఇంకొన్ని జ్ఞాపకాలు వారి మనసుల్ని గుర్తు చేస్తాయి

కాని కొన్ని జ్ఞాపకాలు నన్ను నేనే మర్చిపోయేలా చేస్తున్నాయి...!!!

-నందు

స్వేచ్చకి అడ్డుపడకు...!!

జీవితంలో ఎవ్వరికి అధిక ప్రాధాన్యత ఇవ్వకు...!!!
ఒక వేళ నువ్వు ఎవరినైనా భాగా ఇష్టపడితే 
వారికి స్వేచ్ఛనివ్వు, వారి స్వేచ్చకి కూడా అడ్డుపడకు...!!
వారు కూడా నిజంగా నిన్ను ఇష్టపడితే వారే తిరిగి జీవితంలోకి వస్తారు
ఒక వేళ వారు తిరిగి రాలేదంటే నీ జీవితమనే పుస్తకంలో 
వారి పేజి సమాప్తమని అర్థం...
వినటానికి ఇలాంటివి భానే ఉంటాయి,
కాని భరించటానికి మాత్రం భరించలేనంతగా భాదగా ఉంటాయి 
కాని ఇలాంటివి మనకేవ్వరు చెప్పరు..
మనకు ఎవ్వరు ఇలాంటివి  చెప్పినా అర్థం కావు
ఒకటి మాత్రం నిజం కొన్ని స్వీయానుభవంతోనే తెలుసుకోవాలి
 -నందు
Friday, August 08, 2014 - , , , 0 comments

బ్రతకటం మాత్రం కామన్

మనిషి బ్రతకాలనుకుంటే ఎలాగైనా బ్రతుకుతాడు 
అందరు ఉన్నా  బ్రతుకుతాడు , 
ఎవ్వరు లేకపోయినా బ్రతుకుతాడు, 
కాని బ్రతకటం లోనే చాల తేడా 
అందరు ఉన్నప్పుడు ఆనందంగా, 
ఎవ్వరు లేనప్పుడు ఏకాకిలా .  
కాని బ్రతకటం మాత్రం కామన్ భయ్యా..!!! 
                                  -నందు 


Friday, August 01, 2014 - , , , , 1 comments

మనసు- పుస్తకం

మనసెట్టి చదివితే 
ప్రతి మనసు ప్రతి మనిషి ఒక పుస్తకమే 
కాని సారం మాత్రం 
నువ్వు చదివి అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది 
-నందు