Tuesday, April 10, 2012 - , 0 comments

నాకంటూ అన్ని నీవే అయిన నీకు.......

నీ  పరిచయం నాలో కొత్త మార్పుని చూపింది
నేను అనుకున్న ఆశయ సాధన కోసం అడుగులు  వేసేలా చేసింది
ఒంటరిగా ఉన్న నాకు ఓదార్పును పంచింది
నీ మాటలతో నా మనసు గాయాన్ని మన్పించావు 
నీతో సాన్నిహిత్యం కోసం పరితపిస్తూ పరిబ్రమిస్తున్న నా మనసుని మనసులో లేకుండా చేసిన నీ అందమైన మనస్తత్వానికి మనస్పూర్తిగా సలాం చేస్తూ 
నీ మాటలను మదిలో మేదిల్చుకుంటూ 
జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్న నేను
నాకంటూ అన్ని నీవే అయిన నీకు 
నీకంటూ ఏమి కాని నేను
 ప్రేమతో అందిస్తున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు.........
                                                    -నందు 
                                                                                   
                                                                                                  




   ఒక అక్క కి ప్రేమతో ఈ చిన్ని తమ్ముడు 
Friday, March 09, 2012 - 1 comments

నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే


ప్రియా...! 

నానువ్వు నా కంటి పాపకెంత దూరంగా ఉన్నా  
నా కలలకెప్పుడు  దగ్గరే...

నువ్వు నా మాటలకెంత దూరంగా ఉన్నా
 నా మనస్పంధనలకెప్పుడు దగ్గరే...
కాని నేను నీకెంత దూరంగా ఉన్న నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే...
ఎప్పటికి నీ నేను..   
-నందు 


Monday, March 05, 2012 - 4 comments

నన్ను ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు...!




నన్ను ప్రేమించు కాని, మరీ  దగ్గరకు రాకు 
మన మద్య ఆనందోళ్ళాసాలకు చోటుందని
నన్ను ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు 
 నా కళ్ళు నీ కోసం ఎదురు చూస్తుండనీ  
నా మనసు నీ మాట కోసం మధన పడనీ 
నా తనువు నీ స్పర్శ కోసం తపన పడనీ 
నన్ను ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు 
నా  మనసులోని భావాలను ఇలా స్వేచ్చగా ఎగురుతుండనీ 
నన్ను ప్రేమించు కాని మరీ దగ్గరకు రాకు
దూరంగా ఉండమన్నాను కదా అని
దూరమై(మాయమై పోకు) పోకు...

                -నందు 

Saturday, February 18, 2012 - , 2 comments

ప్రేమ ప్రేమ ప్రేమ




  LOVE LOVE LOVE...

Its a EMOTION which doesn't have any CALCULATION..
Its a REFLECTION with COMBINATION of INFATUATION & ATTRACTION..
Its a JUNCTION with the COLLECTION of Different REACTIONS..
Its a CONTRIBUTION of Lots of CONFUSIONS..
Its a Linear SOLUTION to Your Doubtful QUESTION....
Finally
Its a DEDICATION towards The person whom you LOVE  without any EXPECTATION...
So friends enjoy the Every moment of ur LIFE in Your LOVE...
FEEL it, Share it And DESERVE it...
Happy valantainsday

-With lots of LOVE
Yours Nandu's
Sunday, January 15, 2012 - 5 comments

ప్రేమ ఎం కోరుకుంటుంది ?




ఈ భూమంతా 'ప్రేమే'..
భూమి తన చుట్టూ  తను తిరుగుతున్నపుడు మనుషులు పడిపోవాలి కదా
అలా మనుషులు  పడిపోకుండా ఒకళ్లనోకళ్ళని కట్టి పడేసేది 'ప్రేమ'...
మనం చదువుకున్న సైన్సు ప్రకారం  అది గురుత్వాకర్షణ శక్తి కాకపోతే సమ్మోహన శక్తి, ఆకర్షణ శక్తి ...
 ఏదైన అనండి
 'ప్రేమ' కూడా ఒక రకపు శక్తియే కదా....?
ప్రేమ ప్రేమే..

మరి ఇంత గొప్ప శక్తి ఇముడ్చుకున్న 'ప్రేమ' నిజంగా ఎం కోరుకుంటుంది ?

 'ప్రేమ' సుఖాన్ని , సంతోషాన్ని కోరుకుంటుందా లేక
'ప్రేమ' పెళ్లిని కోరుకుంటుందా ?
ఇవి కాకుండా  యాసిడ్ దాడులను, రక్తపు మడుగులను కోరుకుంటుందా ?
చాలా మంది అంటుంటారు 'ప్రేమ' త్యాగాని కోరుకుంటుందని ...మరి ఇదే నిజమా ?
మరేంటి ?

నేస్తం 'ప్రేమ' వీటన్నింటిని కోరుకోదు
ప్రేమ 'ప్రేమ'నే కోరుకుంటుంది
 అర్థం చేసుకునే  హృదయాన్ని
మనకోసం ఆరాట పడే ఒక చిన్ని గుండెని...
అందుకే ప్రేమని ప్రేమతో  ప్రమకోసం ప్రేమించు  స్వార్థం కోసం కాదు...
ప్రేమని ప్రేమతో ప్రేమించి ప్రేమించబడు... 

-నందు