Sunday, August 07, 2011 - , 14 comments

అమ్మకో ఉత్తరం



ప్రియమైన అమ్మకి ఎలా ఉన్నావ్ ?
నీకేం భావుంటావ్  ఎందుకంటే నేనున్నాను కదా నీకు...! (అని నేననుకుంటాను కాని, నువ్వే నన్ను కంటికి రెప్పల  చూసుకుంటావని  నేనెప్పుడు అనుకోను )
సృష్టిని సృష్టించిన సృష్టి కర్తవి నీవు 
ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసిన ప్రేమ మూర్తివి నీవు 
మా స్వార్థం కోసం నీ జీవితాన్నే త్యాగం చేసిన త్యాగ మూర్తివి నీవు 
నాకు చాలా సార్లు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనిపించింది,
కాని నేను చెప్పేలోపే నీకు నేనంటే ఇంత ఇష్టమో నా మీద నీకెంత ప్రేముందో చూపిస్తావు చూడు ఆ ప్రేమ ముందు నా చిన్ని ప్రేమ బలాదూర్ అనిపిస్తుంది అందుకే నాకెప్పుడు చెప్పాలనిపించదు
నేనే తప్పు చేసినా నన్నే వెనకేసుకోస్తావు  చూడు, ఆ  ప్రేమను చూసి నాలో గర్వం మరింత పెరుగుతుంది..
నా మనసులో ఏముందో నాకే అర్థం కాదు అలాంటిది, నేను ఎపుడైనా ఏదైన  మనసులో అనుకునే లోపే చేసి పెడతావు
డాక్టర్  కంటే ముందుగా నా మౌనాన్ని పసిగాడతావు 
నేను ఎప్పుడైనా నీతో మాట్లాడామని ఫోన్ తీసి నెంబర్ నొక్కుతుంటే నాకన్నా ముందే నువ్వే ఫోన్ చేస్తావు  (నాకు ఇప్పటికి ఆశర్యమే నువ్ నా గుంచి ఆలోచిస్తావని కాని నువ్వు నా కోసమే బ్రతుకుతున్నవని నేను ఇంకా అర్థం  చేసుకోను ఎందుకని ) 
నువ్ గెలుస్తావ్  కన్నా... అని నా నుదిటి మీద ముద్ధాడుతావ్ చూడు 
ఆ ముద్దు నా  గెలుపుకి మూలం అని అనుకోను నేను... 


నీ గురించి ఎంత రాసుకున్న, ఎంత మాట్లాడుకున్న 
నాకు ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది
అదే నీకోసం ఎం  చేయలేదనే బాధ...



ఇలాంటి  ఉత్తరాలు ఇప్పటికి చాలా సార్లు రాసాను కాని 
నీకు పంపించాలనిపించదు 
ఎందుకంటే నా మనసునే చదివేసావు కదా 
ఈ ఉత్తరంలో ఎం రాసానో ఈపాటికే నీకు తెలిసిపోయి ఉంటుందనే....


                                                        -నీ నందు 




Wednesday, August 03, 2011 - , 7 comments

జగమంత ప్రేమ



ప్రేమంటే ఏంటి...?  ప్రేమంటే ఇదేనా ... ఇంకేదోనా....?
నాకెందుకో చాలా సార్లు ఈ ప్రేమ గురించి రాద్దమనుకున్నపుడల్లా ఇంతకి ప్రేమంటే ఏంటి అనే ప్రశ్న మొదలవుతుంది...
నాకు తెలిసి ఈ భూప్రపంచం మీద ఇదే ప్రేమ అని సరైన నిర్వచనం ఇచ్చిన వారు లేరేమో...
 ఎందుకంటే వారి దృష్టిలో  ప్రేమ కి నిర్వచనం అదేనేమో, మనకి అది నచ్చదేమో .... 
మనం సరిగ్గా ప్రేమంటే ఇదేనేమో అని ఒక భావనకి  వచ్చేలోపే ప్రేమంటే ఇదేనా  అనే సందేహం కూడా మొలకెత్తుతుంది ఒక్కసారి ...
మనం ప్రేమించిన నిచ్చెలి మనతోపాటే ఉంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయి  ఇదేనేమో ప్రేమంటే అని మనం అనుకునే లోపే,
 మన కంట్లో ఏ చిన్న నలుసు పడినా మనకంటే ముందు తన కంట్లోంచి నీరు కార్చే కన్న తల్లి ప్రేమను చూసి ఇంత కంటే గొప్ప ప్రేమ ఉండదని ఎప్పుడు చెప్పుకుంటాము...
మన చిన్నప్పుడు నడిస్తే కాళ్ళు నొప్పెడుతాయని తన మోకాళ్లను మన కాళ్ళుగా మార్చి(మనకు కాళ్ళుగా అమర్చి)  మనల్ని నడిపించిన నాన్న ప్రేమ,
 ఎప్పుడు మనతో పోట్లాడే అక్క ప్రేమ, 
ఏ పరిచయం లేకుండానే  మన జీవితంలోకి ప్రవేశించి అడక్కుండానే అన్ని చేసి పెట్టే  ఆప్త మిత్రుడి ప్రేమ....
ఇవన్నీ  ఎప్పటికప్పుడు ప్రేమ అనే పదానికి నిర్వచనాన్ని  మారుస్తూనే  ఉన్నాయి....
ఒక్కోసారి ఒంటరి తనంలో కుడా  ప్రేమను  పొందే మనం ప్రేమలో ఇన్ని రకాలను ఆస్వాదించాక,
 ఏ ఒక్క అనుభూతినో లేక, ఏ ఒక్క  అనుభవాన్నో ప్రేమనుకోవటం పొరపాటే ...
ఎందుకంటే ప్రతి "ప్రేమ" మనకు  "ప్రేమ" గానే ఉంటుంది.
 మరి నిజమైన ప్రేమ ఏంటంటే  మనం పొందే  ప్రేమలో ఎంత వరకు నిజాయితి ఉందో గ్రహించడమే ...
ఆ  నిజమైన  ప్రేమ ఆనేది ఏంటో తెలుసుకునేలోపే, 
దాన్ని గ్రహించేలోపే మనం ఆ ప్రేమకే దురమవుతామేమో... 
ఒక్కోసారి ఈ జీవితానికి  కూడా.... 
                                                                    
                                      -నందు 
Sunday, July 31, 2011 - , 11 comments

ఎం కోల్పోతున్నాం మనం ?


మనం  జీవితంలో ఏదో కోల్పోతున్నాము,
శాస్త్రీయ విజ్ఞానంలో ఎంత వేగంగా అబి వృద్ది చెందుతున్నమో 
 మానవీయ విలువలను మాత్రం అంతకు మించిన వేగం తో అంతరించుకుంటున్నాము .

ఒక సారి గతం లోకి తిరిగి చూసుకుంటే..
కల్మషం లేని చిరునవ్వులు,
ప్రేమానురాగాలతో పెనవేసుకున్న బంధాలు,
అభిమానం, ఆప్యాయతలతో అలుముకున్న అనుబంధాలు, 
కాఫీ కబుర్లతో కాలాన్ని మించిన కాలక్షేపాలు, 
అంతేనా, ఇవన్నీ పై పెచ్చుకే......
కాని ఇదంతా ఒకప్పుడు

ఇప్పుడున్నదల్ల  
పైపైకి ప్లాస్టిక్ నవ్వులు, రెడీమేడ్ బంధాలు, 
డాలర్ల  మోజులో దూరమైన అనుబంధాలు,
మాట్లాడే తీరిక లేక "మిస్ యు" అంటూ మెసేజులు,
కంప్యూటర్లతో  కాపురాలు, మరయంత్రాలతో  మీటింగులు...
ఇవేనా ఇంక ఎన్నెన్నో..!

ఎన్ని కోల్పోయినా 
జీవచ్చవంలా  బ్రతుకుతూ ప్రాణాలు కోల్పోకుండా మిగిలింది మన ప్రాణమొక్కటే ...  
'కోట్ల'కు వెలకట్టలేని ఆస్తులను కోల్పోయాక 
'పైసా'కి పనికిరాని ప్రాణమెందుకో ......    
                                  
                                      -నందు 
                               



Saturday, July 30, 2011 - , 0 comments

గమ్యాన్ని వెతుక్కుంటూ....



వెళ్తున్నా వెళ్తున్నా దూరంగా వెళ్తున్నా
కానరాని దూరాలకు, కనిపించని తీరాలకు....
పయనమెటో తెలియదు పాదాల అడుగులు ముందుకే  
గమనమేటో తెలియదు కాని గమ్యాన్ని చేరేటందుకే...


-నందు


 

నా జీవితంలోకి....


మళ్ళీ తనోచ్చింది...!

అవును తనోచ్చింది.
నా ఊహల్లోకి,
నా జ్ఞాపకాల్లోకి,
నా ఆలోచనలోకి,
నా మనసులోకి...
నా జీవితంలోకి....

తనెవరోకాదు వర్షాకాలం..!!        
                       -నందు