Showing posts with label ఫీలింగ్స్. Show all posts
Showing posts with label ఫీలింగ్స్. Show all posts
Friday, January 20, 2023 -
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
నేటి బంధాలు
Saturday, December 24, 2022 -
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
విలువలు - ఉలవలు
మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విలువలు,
ఉల్వలు అంటూ మాట్లాడకూడదు
మనిషికి ఇచ్చే విలువ
ఎప్పుడు ఒకేలా ఉండాలి
స్థాయిని బట్టి,
డబ్బుని బట్టి మారకూడదు
-న💚దు
Thursday, December 08, 2022 -
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
1 comments
మనం అనర్హులం
మనం పుట్టినప్పటి నుండి
తను చనిపోయే వరకు
మన గురించే ఆలోచించే
మన అమ్మ గురించి
ఎన్నడూ సరిగ్గా పట్టించుకోని మనం,
మాతృదినోత్సవం జరుపుకోవటానికే కాదు
మాట్లాడుకోవటానికిి కూడా అనర్హులం..!!!
-నందు
#HappyMothersDay
#MothersDay
#TheOtherSide
Wednesday, November 10, 2021 -
జీవితం,
తెలుగు,
తెలుగు కవితలు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
ఉండి లేనట్లు
జీవితంలో అందరు ఉన్నప్పుడు,
అన్ని ఉన్నపుడు బాగానే ఉంటుంది
ఎవ్వరు లేనప్పుడు ,
ఏమి లేనప్పుడు కూడా బాగానే ఉంటుంది
కానీ ఎప్పుడైతే
అందరు ఉండి ఉండనట్లు,
అన్నిఉండి, లేనట్లు ఉంటుందో
దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు...!!
-నందు.
08-03-2020
Friday, June 25, 2021 -
Nandu Writings,
కథలు,
కవితలు,
జీవితం,
తెలుగు,
తెలుగు కవితలు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
శెలవు మిత్రమా !
నిజమే !
తెలిసే బంధమనే ఆ చట్రంలో ఇరుక్కున్నావు,
ఇప్పుడు అనుభవిస్తున్నావు,
తప్పదు బయటికి రావాలి
కాదు కాదు దూరంగా రావాలి
ఎదుటివాళ్ళు
నువ్వు, నీ అస్థిత్వంలేని
ప్రశాంత వాతావరణాన్ని
కోరుకుంటున్నపుడు
నువ్వు మౌనంగా వెళ్లిపోవటమే ఉత్తమం.
అక్కడా తప్పు
నీదా,
వేరే వాళ్ళదా లేక
ఎవరి వల్ల తప్పు జరుగుతుందనే
విషయాలిప్పుడు అనవసరం...
నువ్వే ఒక సమస్య అయినపుడు
సమాధానం కూడా నువ్వే చెప్పాలి
ఆ సమ్యసనీ తీర్చనప్పుడు
కనీసం అసమస్యకీ
దూరంగా అయినా ఉండాలి
ఇంకెన్నాళ్లు ఇలానే ?
కొత్తగా ఏమి నేర్చుకుంటున్నట్లు ?
ప్రతి సారి ఇదే తప్పు, ఇదే గుణపాఠం !!
తప్పు చేయటం అలవాటయ్యిందా లేక ?
గుణపాఠాన్ని నీ జీవితం అలవాటు పడిందా ??
నువ్వు చెయ్యాలనుకున్నదొకటి,
అక్కడ జరిగేదింకొటి,
పరిస్థితులు పగబట్టినట్లు ప్రవర్తిస్తే
నువ్వెప్పటికీ నిన్ను నిరూపించుకోలేవు
నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన
అవసరమే లేదక్కడ
అర్థంచేసుకునే పరిస్థితులు లేనప్పుడు,
రావని తెలిసినప్పుడు
అక్కడ ఉండటమే అనవసరం...!!
నీ కోపాన్ని ఆవేశాన్ని,అన్నింటిని
మౌనంగా మడిచి
జేబులో పెట్టుకుని వెళ్ళిపో
చాలిక వెళ్ళు !!
శెలవు మిత్రమా !
-నందు.
08-03-2020
Wednesday, June 16, 2021 -
Nandu Writings,
నిజాలు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
విలువ
10-02-2020
వస్తువు
విలువ పోతేనో,
పాడైపోతేనో తెలుస్తుంది
మనిషి విలువ కూడా
దూరమైపోతేనో
చనిపోతేనో తెలుస్తుంది
-నందు.
Saturday, May 16, 2020 -
Nandu Writings,
కవితలు,
జీవితం,
తెలుగు,
తెలుగు కవితలు,
నిజాలు,
ఫీలింగ్స్,
బాధ,
సత్యాలు
0
comments
ప్రయాణం - బంధం
ఒక బంధాన్ని గాని,
ప్రయాణాన్ని గాని,
ఇద్దరు మొదలుపెట్టినప్పుడు,
ఆ ప్రయాణంలో ఉండాలా వద్ద అనేది
ఇద్దరు కలిసి ఒక అభిప్రాయానికి రావాలి
అప్పుడే ప్రయాణమైనా,
బంధమైనా సాఫీగా ఉంటుంది
లేదంటే ఏ దారి లేని ఎడారిలోనో
గోదారిలోనో కలిసిపోతుంది
-న💚దు
08-03-2020
Saturday, May 02, 2020 -
Nandu Writings,
కవితలు,
జీవితం,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
నిజాలు,
ప్రేమ,
ఫీలింగ్స్,
బాధ
0
comments
కొన్ని జ్ఞాపకాలంతే
కొన్ని జ్ఞాపకాలంతే
గుర్తొచ్చినప్పుడల్లా
బాధ కలిగిస్తాయి
కొన్ని జ్ఞాపకాలంతే
జీవితాంతం
గుర్తుంటాయి
-న💚దు
Saturday, April 18, 2020 -
LOVE,
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
0
comments
దాచుకోలేనంత ప్రేమ- తట్టుకోలేనంత నొప్పి
దాచుకోలేనంత
ప్రేమని ఇచ్చి చూడు
తట్టుకోలేనంత నొప్పిని
తిరిగిస్తుందీ ప్రేమ..!
చెప్పలేనంత
ఇష్ఠాన్ని చూపించు
ఓర్చుకోలేనంత బాధని
ఒదిలేసి వెళ్తుందీ ప్రేమ..!!
-న♥️దు
08-03-2020
08-03-2020
Thursday, April 09, 2020 -
Nandu Writings,
కథలు,
కవితలు,
జీవితం,
తెలుగు,
నందు,
నిజాలు,
ప్రేమ,
ఫీలింగ్స్,
సత్యాలు
0
comments
లోకం పోకడ !
బతికున్నప్పుడు మాటలతో చంపుకుని,
చచ్చాక జ్ఞాపకాలతో బ్రతికేస్తున్నాం
ఇదే నేటి లోకం పోకడ !
మనిషికి ఆర్ధిక ఇబ్బందులున్నా
తట్టుకోవచ్చు కానీ,
మానసిక ఇబ్బందులను
తట్టుకుని నెగ్గుకురావడం చాలా కష్టం... !!
-న💚దు
Thursday, April 02, 2020 -
LOVE,
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
0
comments
ప్రేమంటే ఇంతే
రోజంతా తను మనతో ఉన్నా
పది నిముషాలు కనపడకపోతే
కంగారు పడతాం చూడు
అదే ప్రేమంటే...!!!
పది గంటల నుండి
తనతో కనీసం పది నిముషాలైనా
మాట్లాడటం కోసం
ఎదురు చూస్తావు చూడు
అది కూడా ప్రేమే...!!!!
-న💚దు
#ValentinesDay2018
Friday, March 13, 2020 -
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ప్రత్యేకం,
ఫీలింగ్స్,
సత్యాలు
0
comments
నాన్న
నాన్న
మన బాల్యం నాన్న
మన చిన్నపాటి మొదటి హీరో నాన్నే
నాన్నంటే భయం ,కాదు కాదు
అంతకు మించిన గౌరవం కూడా
మన చదువు నాన్న సమాన మార్కులు నాన్న
మన పరువు నాన్న
మన సంతోషం అమ్మ కావొచ్చు
కానీ మన దిగులు మాత్రం మళ్ళి నాన్నే
చిన్నతనంలో
బుడి బుడి అడుగులు వేయటం నుండి
మనం తప్పటడుగులు వేయకుండా
మనల్ని వెంటాడుతున్న నీడ నాన్న!!
నాన్నంటే నమ్మకం
నన్నుంటే దైర్యం
ఏదైనా అయితే చూసుకోవటానికి
నాన్నున్నాడులే అనుకునేంత పొగరు కూడా నాన్నే .
నువ్వెలా చదువుతావో పదిమందిలో
సంతోషాన్ని పంచుకునేది అమ్మ
సంతోషాన్ని పంచుకునేది అమ్మ
కానీ నువ్వెలా చదవాలో ఎలా ఎదగాలో
ఎలా నిలవాలో పది మందిని పరిశీలించి,
నీకు మంచిని చెప్పేది మాత్రం నాన్నే .
బాగా ఉండటం నుండి త్వరగా బాగుపడి
ప్రయోజకులం అవ్వాలని ఆశించేది నాన్న
తాను కన్న కళలు కళ్ళతోనే దాచుకుని
పిల్లల కలల్ని కళ్ళముందు చూసుకుంటూ
వారి బాగుగోసం నిరంతరం కష్టపడే శ్రమజీవి నాన్న
కష్టాలు బాధలు వచ్చినప్పుడు
ఎవ్వరు ఉన్న లేకున్నా
మన వెనకాలే ఉండి
మనల్ని ముందుకి నడిపించేది మన 'అమ్మానానే'
అమ్మ ప్రేమను ఆస్వాదిస్తే అర్థమవుతుంది నాన్న
ప్రేమను 'నాన్న' అనే బాధ్యతను మొస్తే తెలుస్తుంది
-న💚దు
21.02.16
Wednesday, February 26, 2020 -
Nandu Writings,
review,
కథలు,
జీవితం,
ప్రత్యేకం,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
0
comments
కడలికో ప్రేమలేఖ
ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు,సెల్ఫీలంటూ ,
ఏ పండగకో , న్యూ ఇయర్ కో ఉత్తరాలొస్తే పొంగిపోయేవాళ్ళం
ఇలాంటి కాలంలో కూడా ప్రేమ లేఖలు రాయొచ్చని
ఎవరైనా ప్రేమ లేఖలు రాస్తారు,
పేరుకి తగ్గట్టే తనలో సముద్రమంత ప్రేముంది
తాత మీదున్న అమితమైన ప్రేమతో కడలి సత్యనారాయణగా
ఎన్నో ముద్దు ముద్దు మాటలు,
పుస్తకం చదువుతుంటే తను రాసిన ఎన్నో
ఇదేగా ప్రేమంటే ?
నేనోసారి రాసినట్లు గుర్తు
'ఈ జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా
ఊహల జ్ఞాపకాల సమ్మేళనమే
ఈ 'లెటర్స్ టూ లవ్'
పదేళ్ల క్రితం 'ప్రేమలో -మనం' అనే శీర్షికన గీతిక.బి గారు
-న💚దు
Subscribe to:
Posts (Atom)