Showing posts with label నేస్తం. Show all posts
Showing posts with label నేస్తం. Show all posts

తీరాన్ని తాకని ఉత్తరం

నేస్తం 

"నువ్వు నాకు పరిచయం కాక ముందు 
నాకు ఆ కాలేజీలో రోజులన్నీ ఒకేలా ఉండేవి...
నీ పరిచయం వల్ల ఎందుకో నాలో మార్పు, 
నాలో నాకే తెలియనంత మార్పు...
నువ్వొచ్చాక నా డైరీ రంగుల  పుస్తకంగా మారిపోయింది... 
ప్రతి రోజు నీతో స్నేహం గురించే రాసాను
నిన్ను తలచుకుంటూ, 
నీ జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ, 
నీతో మాటాడిన సంతోషంలోనో,
లేక నువ్వు మాట్లాడలేదన్న బాధలోనో...
నిన్ను చూసి చాలా విషయాలలో స్పూర్తిపొందాను 
ఎప్పుడైనా నీకు ఫోన్ చేసే నీ ఫోన్ బిజీగా ఉంటే నేనెంత బాధపడేవాడినో  తెలుసా..?
నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నందుకు కాదు, 
ఆ క్షణాన నీతో మాట్లాడలేకపోయినందుకు...!
ఉన్నట్టుండి నువ్వు మాట్లాడటం మానేసావు 
మళ్లి  నా గమ్యం అంతా చంద్రుడు లేని ఆకాశంగా మారిపోయింది. 
ఈ మద్య నిన్ను తలచుకుంటూ నిద్ర పట్టక  ఏ అర్ధరాత్రికో నిద్రపోయిన రోజులు లెక్కలేనన్ని...
అయిన ఇప్పటికి ఏమి మారలేదు 
ఎక్కడైనా అందమైన చిరునవ్వు కనిపిస్తే చాలు నువ్వే గుర్తొస్తావు....
 అదేంటో నువ్వు గుర్తొచ్చిన  ప్రతి సారి  నాకే తెలియకుండా 
నా కంటి నుండి కన్నీటిధారా కురుస్తూనే ఉంది...
మిత్రమా...!!!
నీవులేకపోయినా నీ జ్ఞాపకాలు మాత్రం పదిలం...
ఫోటోలలో, బహుమతులలో కాదు.. నా గుండెల్లో.   
ఎప్పటికి నీ నేను..." 
                                                          -నందు 

Wednesday, January 29, 2014 - , , , , 0 comments

అంతా మన చేతుల్లోనే...!!!

తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము , 
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!

ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే  నమ్మకం, తనే ఇకపై  మన జీవితం...
కాని  ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం 
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
 అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి తనకి దూరంగా ఉండటానికి నిర్ణయించుకుంటాం... 

తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు 
కాని అన్ని తనే అనుకున్న తనే వెళ్లిపోయినపుడు 
గురువు లేని బడి,
దేవత(దేవుడు) లేని  గుడి,
చంద్రుడు లేని ఆకాశం, 
సూర్యుడు లేని ఉషోదయంలా  ఉంటుంది మన(తన) జీవితం ...  
ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు 
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
                                                -నందు 

P .S : తను అంటే మనం ఇష్టపడే వారు ఎవరైనా అయిన కావచ్చు 
Friday, December 16, 2011 - , 11 comments

నేస్తమా నీ చిరునామా ఎందుకు ?

నా కంటి నిండా నీవే అయినప్పుడు 
మెరిసే అద్దం లో నీ ప్రతి బింబం ఎందుకు ?
 తలచిన ప్రతి తలపు నీవే అయినప్పుడు 
తలుపు తట్టేందుకు నీ ఇంటి నెంబర్ ఎందుకు ?
జీవనయానంలో వేగుచుక్క నీవైనప్పుడు 
కిందా మీద  లోకంలో ఎనిమిది దిక్కులెందుకు  ?
ఓటమి ఎరుగని నా లక్కి  నెంబర్ నీవైనప్పుడు 
కోడ్ నంబర్ తో  సహా నీ ఫోన్ నెంబర్ ఎందుకు ?
ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎద నిండా నీవే అయినప్పుడు 
నేస్తమా నీ చిరునామా  ఎందుకు  ?

Tuesday, September 13, 2011 - , 6 comments

మన స్నేహం








ఎన్ని జన్మల బంధమో మన పరిచయం...
ఎలా మొదలైందో ఆ క్షణం...
ఒకరికొకరు తెలియని మనం మన తొలినాళ్ళలో మాట్లాడుకోవాలనే  ఆశకాని
 పరిచయాలు పెంచుకోవాలనే  ఆత్రుత కాని  లేకుండేవి కదా...
ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా నీ దారి నీది, నాదారి నాదిలా ఉండేది..
వహ్ !
క్రమంగా ఎంత మార్పు...
చూడగానే చిరునవ్వులు
హాయ్ అంటూ ఆహాకారాలు 
గంటల కొద్ది గ్రూప్ మీటింగులు
ఏ సందర్బము లేకుండానే పార్టీలు
క్లాసురూం  క్యాంటీన్ క్యాంపస్ అంత మన ప్రపంచమే కదా...
టిఫిన్ బాక్స్  లనే  కాదు, కష్టాలను కూడా పంచుకుంటిమి... .
గెలిచినప్పుడే కాదు గొడవలలో కూడా వీడిపోకపోతిమి...
తోడు నీడగా కంటికి  కునుకు లేకుండా ఎన్నో రాత్రులను ముచ్చట్లతో మున్చేస్తిమి...
సరదాలు పెరిగిన మన సాన్నియిత్యంలోఅల్లరితనంతో  పాటు
చేరవలసిన గమ్యాలను ఆచరించాల్సిన మార్గాలను కూడా నిర్దేశించుకుంటిమి,      
ఇవన్నీ ఇప్పటికి నా మది నిండా పదిలమే...
మారుతున్న కాలానికి తోడు పెరుగుతున్న బాద్యతల నడుమ 
సతమతమవుతున్న మనకి మన స్నేహమొక్కటే ఆలంబన...
 మనం ఎంత ఎదిగిన మనమెప్పటికి అలనాటి  మిత్రులమే....
నేస్తం ఇలాగే ఎప్పటికి నిలవాలి మన స్నేహం కలకాలం..... 

                                                               -నందు.

 
                                      
Saturday, September 10, 2011 - , 4 comments

ఈ స్నేహం గొప్పది

స్నేహం దేవుడిచ్చిన గొప్ప వరాలలో ఒకటి...
ఎందుకంటే మన అమ్మ నాన్నలను ఆ దేవుడే నిర్ణహిస్తాడు 
 కాని మనకు మాత్రం మన  స్నేహితులను ఎంచుకునే అవకాశం కల్పిస్తాడు...
మనం ఎవరితోనైనా  స్నేహం చేసేటప్పుడు మనమేమి ఆశించం... 
అలాగని భవిష్యత్తుని అంచనా వేసి కూడా స్నేహం చేయము 
అప్పుడు ఆ సమయాన మన మనసులో కలిగే స్పందనల ద్వారా
మనకు  తెలియకుండానే వారి మీద మనకు ఒక రకమైన ఇష్టం ఏర్పడుతుంది
అక్కడి నుండి మొదలైన ఆ మజిలి 
మనల్ని ప్రపంచం వెలివేసినా  మన నేస్తం మనతో పాటే ఉండే అంత బలంగా పాతుకుపోతుంది.......
ఎల్లప్పుడూ మన మంచిని కోరుకుంటుంది
కష్టాలోచ్చిన కడదాక తోడుండేది...
తన కడుపు మాడ్చిన మన కడుపు నింపేది...
మనం గెలిస్తే ఎక్కువగా సంతోషించేది..
అన్నింటికీ నేనున్నానంటూ  ఎదురు నిలుస్తుంది...
అవసరమైతే ప్రాణ త్యాగాలకు కూడా వెనకడుగు వేయని నైజం ఈ స్నేహానిది...
అలాంటి గొప్పదనం గల ఈ బంధం... 
నీతో స్నేహం నాకేం లాభం అనే విధంగా మారుతున్న ఈ సమాజంలో 
కులమత భేదాలకతీతంగా  పేద ధనిక అనే దాపరికాలు లేకుండా 
పురాతనకాలంలో శ్రీ కృష్ణుడు కుచేలుడు
రాజుల కాలంలో అక్బరు బీర్బలు లాంటి వారి గొప్ప స్నేహాలు మనకి ఆదర్శం కావాలి 
నేస్తమా నీ మిత్రుల నుండి ఏదో ఆశించాలనే  వంకతో 
స్నేహం అనే పేరుతో  నమ్మకాన్ని నయవంచన చేయకు 
స్నేహనికున్న విలువను  పాడు చేయకు....

నేస్తం స్నేహం  గొప్పది...
                                                 -నందు.




Tuesday, July 12, 2011 - , 0 comments

ఓ భార్గవి....!








నిన్ను చూస్తుంటే నా మీద నాకే అసహ్యం, 
ఎన్నాళ్ళయిందో   నీలా నేను నవ్వుకుని ... ..
ఎలాంటి కల్మషం లేని నీ నవ్వు చూసి నాకు  అసూయ పుడుతూనే ఉంది...
పాదరసంలా నువ్వు కదులుతుంటే, ఇంత ఎనర్జీ ఎక్కడినుంచి వస్తుందో  అర్థమే అవలేదు నాకు...
నువ్వెంత అల్లరి చేసిన కోపమే రాలేదెందుకో....
మళ్లీ ఒక్కసారి  నన్ను నీలో చూసినట్లుంది ...
పెద్ద వాళ్లమయ్యం మాకు బయటి ప్రపంచం తెలుసనుకుంటాం కాని నీ నవ్వుల ప్రపంచం ముందు అవన్నీ దేనికి పనికి రావేమో...,
 ఎలాంటి ఒత్తిడిలు లేని నీ లాంటి నవ్వు చూసి నిజంగా ఎన్నాళ్ళయిందో......

మేము ఎన్ని  సార్లు నవ్వుకున్న ఆ నవ్వుల వెనకాల ఎన్నో భాధలు ఏవో  గాధలు...
  నీ అల్లరి ప్రపంచం ముందు ఈ  ఆధునిక ప్రపంచం, నీ నవ్వుల ప్రపంచం ఈ నవీన ప్రపంచం ముందు అన్ని బలాదూర్...
నిన్ను చూసాకే మల్లి నా చిన్నతనం గుర్తొచ్చింది
కాదు కాదు మళ్లీ నాకు చిన్న పిల్లాడినైపోవాలనిపిస్తుంది...
నిజంగా ఆ చిన్నతనం ఎప్పటికి అలాగే ఉంటే ఎంత  భావుండునో...
                                                         -నందు. 



Thursday, March 31, 2011 - , 0 comments

మన్నించు మిత్రమా....

నువ్వు నవ్వితే నేనానందించాను
నువ్వు గెలిస్తే నే సంతోషించాను 
నీ గెలుపే నా గెలుపనుకున్నాను 
నువ్వు ఓడితే నే భాద పడ్డాను
నీ కడదాక తోడు ఉండాలనుకున్నాను 
కాని ఈ నేస్తాన్ని అర్థం చేసుకోలేదని  లేదని తెలిసి భాదపడుతున్నాను...
అందుకే  మిత్రమా మన్నించు... 

                                -నందు 
Thursday, March 10, 2011 - , 0 comments

నేస్తమా ఏది నీ చిరునామా...?





నువ్వే నా అప్తమిత్రుడివన్నావు,

నీ పరిచయం గొప్ప వరమన్నావు,

నీతో మాట్లాడకపోతే రోజు గడవదన్నావు,

చివరికి నువ్వ్వు లేకుండా బ్రతకలేన్నన్నావు,

ఇన్ని చెప్పి చివరికి ఒంటరిని చేసి వెళ్లావు... 

 నేస్తమా మరి ఇన్నాళ్ళు  నటించావా లేక నమ్మించావా...
 
అయితే  మరి ఏది నీ చిరునామా...?


                                -నందు