కడలికో ప్రేమలేఖ

ఇప్పుడంటే స్మార్ట్ఫోన్లు,సెల్ఫీలంటూ ,
సోషల్ మీడియాకి అలవాటు పడ్డాం కానీ,
దాదాపు పదిపదిహేనేళ్ల క్రితం
సెల్ఫోన్ లేని ఇల్లుండేది,
ల్యాండ్ ఫోన్ లేనిఊరుండేది,
అసలు నెట్వర్క్ సౌకర్యమే లేని ప్రాంతాలుండేవి..!!
అలాంటి టైంలో  కావాలన్న ఉత్తరాలే అన్నీ ...

 పండగకో , న్యూ ఇయర్ కో ఉత్తరాలొస్తే పొంగిపోయేవాళ్ళం
ఇంకా మా స్కూల్ రోజుల్లో ప్రేమ లేఖలు ,
గ్రీటింగ్ కార్డుల కాలం బాగా నడిచేది
ప్రేమలేఖలు రాసిచదివి
పొంగిపోయిన రోజులున్నాయి
భయపడిన రోజులున్నాయి
ఇప్పుడవన్నీ గుర్తొస్తే నవ్వొస్తున్నాయ్
ఇప్పుడన్నీ ఇన్స్టాంట్ ప్రేమలు,
ఇంస్టాగాంలో ఫొటోలేగా ...

ఇలాంటి కాలంలో కూడా ప్రేమ లేఖలు రాయొచ్చని
రాస్తే ఇంత అందంగా ఉంటాయాని తెలియజేసిందీ 'కడలి '

ఎవరైనా ప్రేమ లేఖలు రాస్తారు,
కానీ కడలి మాత్రం ప్రేమకే లేఖలు రాసింది
అదే తాను రాసిన కథల సంపుటి
'లెటర్స్ టూ లవ్'.

పేరుకి తగ్గట్టే తనలో సముద్రమంత ప్రేముంది
ఆప్రేమంత  ఉత్తరాల్లో కనిపిస్తుంది
కానీ తన ప్రేమని చదవటానికిఅర్థం చేసుకోవటానికి
మనకి ఆకాశమంత మనసుండాలి మరి.
ఎంత సులువైన భాషనోఅంత సున్నితమైన భావాలు,
ఎన్నో అందమైన పదాలవేల భావాల అల్లికనే
 'లెటర్స్ టూ లవ్'.

తాత మీదున్న అమితమైన ప్రేమతో కడలి సత్యనారాయణగా
పేరు పెట్టుకుని తనలోని ప్రేమనిపెంచుకున్న ఆశలను,
పంచుకున్న ఊసులను ఎంతందంగా రాసిందో !
స్వతహాగా తాను పరిచయం లేనప్పటికీ
పుస్తకం విడుదల ప్రచారాల్లో కవర్ పేజీ చూసే
చదివేయాలని నిర్ణహించుకుని
బుక్ ఫెయిర్ కి వెళ్లి తనకి కలిసి,
పుస్తకం కొని చదివాక రాస్తున్న మాటలివి


ఎన్నో ముద్దు ముద్దు మాటలు,
చిట్టి చిట్టి పదాలుప్రేమలో ఉండే ఆశలు,
చిన్ని చిన్ని కోరికలు ,అలకలు,కోపాలు,గిల్లికజ్జాలు,
ముద్దు ముచ్చట్లువిరహ వేదనలుఎడబాట్లు,
ఊహల్లో విహారించడాలు జ్ఞాపకాల్లో బ్రతికేయడాలు
అబ్బో ఎన్నెన్నో భావాల మిళితమే  ప్రేమ లేఖలు.
తన వయసుకి సంబంధం లేకుండా
వివిధ వయసుల్లోని ప్రేమలను ఎంతందంగా రాసిందో కడలి !

పుస్తకం చదువుతుంటే తను రాసిన ఎన్నో
మాటల్నిమార్క్ చేద్దామనుకున్నా
కానీ  అందమైన పదాల అల్లికను
నా పిచ్చి గీతాలతో నింపటం ఇష్టం లేక
వాటినలానే చదివేస్తూ మధ్య మధ్యలో
జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతూమళ్ళి బయటికి వచ్చి చదివేసాను

ఇదేగా ప్రేమంటే ?
ఎవరో మాటలకి మనం పొంగిపోతాం
ఎవరి జ్ఞాపకాల్లోనో మనం కూడా కలిసిపోతాం
ఎవరో రాసిన బాధలకి కూడా మనం బాధపడతాం
పుస్తకం చదువుతున్నంత సేపు
అరే మనకి ఇలానే జరిగిందే
మనము ఇలానే అన్నామే,
మనము ఇలానే చేశామే అనే భావాలు కలగకపోవు
ప్రేమలో ఉన్నవాళ్లు పొంగిపోతారు,
ప్రేమలో పడని వాళ్ళు ఆశ్చర్యపోతారు,
ఫెయిల్ అయినా వాళ్ళు మాత్రం వెక్కి వెక్కి ఏడుస్తారు.
కొన్ని ప్రేమలు సఫలం అవ్వొచ్చు,
మరిన్ని విఫలం అవ్వొచ్చు,
ఎందుకంటే  ప్రేమలో గెలిచినాఓడినా
జ్ఞాపకాలే శాశ్వతంగా ఉండేది మనం కాదు,

నేనోసారి రాసినట్లు గుర్తు 
' జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా
కొన్నింటిని మోయక తప్పదు,
కొన్నింటిని వదిలేయక తప్పదు
ఇంకొన్నింటితో కలిసి బ్రతకతప్పదు.'
ఇలాంటి ఎన్నో అందమైన
ఊహల జ్ఞాపకాల సమ్మేళనమే

 'లెటర్స్ టూ లవ్'

పదేళ్ల క్రితం 'ప్రేమలో -మనంఅనే శీర్షికన గీతిక.బి గారు
రాసిన ప్రేమ కవితల్ని చదివాక మళ్ళి
అంతే సహజంగా అనిపించాయి  'ప్రేమ కథలు'
మీకూ కుదిరితే చదవండి కుదిరించుకునైనా చదవండి(Link)
-💚దు
    



0 comments: