Sunday, October 09, 2016 - , , , , , 0 comments

హైదరాబాద్లో రోడ్లు- హైద్రాబాద్లో వానలు...!!


ఎవరు చేసిన పాపమో, హైదరాబాద్లో ఉండే వారి అదృష్టమో తెలియదు గాని
కొన్ని సంవత్సరాలుగా సరిగా వర్షాలు లేవు పోయిన నెల దాక కూడా.
గత రెండు మూడు వర్షాలు గట్టిగా పడే సరికి
హైదరాబాద్లో రోడ్డు నాశనం కావటానికి వర్షమే కారణం అని
పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళం అని చెప్పుకునే మనుషులు
ఇంకెన్నాళ్ళు మీరు చేసే తప్పుల్ని వేరోకరిమీద తోయటం ?
గత కొన్నేళ్ళుగా రోడ్డు మరమత్తు అంటే గుంటలు ఉన్నచోట పైపైన డాంబర్(తారు) వేయటం.,
రోడ్డు వేయటం అంటే ఉన్న రోడ్డు మీద మళ్ళి ఇంకో పొరలాగా రోడ్డు వేయటం తప్పిస్తే
ఏ ఒక్కసారైనా ఉన్న పాత రోడ్డుని తవ్వేసి మళ్ళి కొత్తగా రోడ్డు వేయటం జరుగుతుందా ?
ఇది మా తప్పు కాదు గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలా జరిగింది అంటారు
సరే దాన్ని ఒప్పుకుందాం, మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం ఎం చేస్తోంది ??
మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్ పరిక్షకి జాగ్రత్త తీసుకుంటాం
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పరీక్ష రాస్తే ప్రతిసారి ఫెయిల్ అవ్వటమే జరుగుతుంది..
ఇంకెన్ని సంవత్సరాలు సాకులతోనే సరిపెడతారు ?
మెట్రో రైలని, అదని, ఇదని.
మెట్రో రైలు పని జరిగని చాల చోట్ల ఇదే పరిస్థితి
వర్షం వస్తే రోడ్డు మీద ఉన్నది చిన్న గుంతనో, మ్యాన్ హోలో అని
జనాలు భయభయంగా అడుగేస్తున్నారు ?
వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళు నిలుస్తున్నాయి
కరెక్టే కానీ నీళ్ళేందుకు నిలుస్తున్నాయి ?
దానికి గల కారణాలేవి,
సరిదిద్దే మార్గం ఏది అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుందా ?
నాలాలను సరిదిద్ది, డ్రైనేజి వ్యవస్థని పునరుద్ధరణ చ్గేయాలి కదా ?
ఇది రాత్రికి రాత్రే జరిగే మార్పు కాదు
పోయిన సంవత్సరం వర్షాకాలం అయిపోయిన తరువాత
మరమత్తులు చేయటం మొదలు పెట్టిన కనీసం కొంచెమైనా తేడా ఉండేది..
చేతగాని గాని ప్రభుత్వం, చేతగాని వ్యవస్థ, ఇదేనా మీరంటున్న బంగారు తెలంగాణ ??
ఇది కాదు ప్రజలు కోరుకున్నది ,మార్పు..
మార్పంటే అయిదేళ్ళకోకసారి ప్రభుత్వాల మార్పు కాదు.
ప్రభుత్వ విధానాల్లో మార్పు, మీ ఆలోచనల్లో మార్పు.
పాలించే ప్రభువులారా ,
అందకారంలో ఉన్న అధికారులారా ?
మొద్దు నిద్రను వీడండి
మీరు అంటున్న బంగారు తెలంగాణలో రోడ్డ్లు బీటలు వారిపోయాయి.
కళ్ళు తెరిచి చూడండి.
ప్రశ్నించే వాడ్ని ప్రతిపక్షం అంటే నేనేమి చేయలేని
కాని సగటు హైదరాబాదీ ఆవేదన ఇది.
-నందు

0 comments: