Friday, April 19, 2013 - 0 comments

శ్రీరామ నవమి శుభాకాంక్షలు


మనిషి జీవితంలో తను ఒకే సారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రాతి సారి జరిపించాలనుకుంటారు  

ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం  నిత్య నూతనమే, 
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే...  
ప్రతి సంవత్సరం మనమే దగ్గరుండి మరీ ఈ పెళ్లిని జరిపిస్తాము 
మనింట్లో పెళ్ళిగా మురిసిపోతాము
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ళ గురించి,
పెళ్లి సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాము  
పచ్చని తోరణాలతో, 
మేళ వాయిద్యాల నడుమ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్ళి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 
Wednesday, April 10, 2013 - 0 comments

శూన్యం లోకి...!!!అల్లర్లను, ఆనందాలను పక్కకు తోసేసీ,
బంధాలకు,  బాంధవ్యాలకు దూరంగా,  
జరిగిన అనుభవాలను, మిగిలిన అనుభూతులను  భుజాన వేసుకుని 
మనసుని మ్యూట్ లో పెట్టేసి,  
అలా శూన్యం లోకి నడవాలనుంది 
ఇలా ఎంత దూరమైనా...... !!! 
                      
                          -నందు