Friday, March 9, 2012 - 2 comments

నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే


ప్రియా...! 

నానువ్వు నా కంటి పాపకెంత దూరంగా ఉన్నా  
నా కలలకెప్పుడు  దగ్గరే...

నువ్వు నా మాటలకెంత దూరంగా ఉన్నా
 నా మనస్పంధనలకెప్పుడు దగ్గరే...
కాని నేను నీకెంత దూరంగా ఉన్న నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే...
ఎప్పటికి నీ నేను..   
-నందు 


Monday, March 5, 2012 - 4 comments

నన్ను ప్రేమించు కాని మరి దగ్గరకు రాకు...!నన్ను ప్రేమించు కాని, మరి దగ్గరకు రాకు 
మన మద్య ఆనందోళ్ళాసాలకు చోటుందని
నన్ను ప్రేమించు కాని మరి దగ్గరకు రాకు 
 నా కళ్ళు నీ కోసం ఎదురు చూస్తుండనీ  
నా మనసు నీ మాట కోసం మధన పడనీ 
నా తనువు నీ స్పర్శ కోసం తపన పడనీ 
నన్ను ప్రేమించు కాని మరి దగ్గరకు రాకు 
నా  మనసులోని  భావాలను ఇలా స్వేచ్చగా  ఎగురుతుండనీ 
నన్ను ప్రేమించు కాని మరి దగ్గరకు రాకు
దూరంగా ఉండమన్నాను కదా అని దూరమై(మాయమై పోకు) పోకు...

                                -నందు