Monday, August 08, 2011 - , 4 comments

ఒక వర్షాకాలపు సాయంత్రపు వేళ...!





అదొక వర్షాకాలపు సాయంత్రం అందులోనూ అమావాస్య,ఆకాశం కారుమబ్బులతో నిండిపోయింది, ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయి... 
అప్పుడప్పుడే చీకటి పడుతుంది, నేను ఆఫీసు నుండి  బయలుదేరే సమయానికే చాలా చీకటి పడింది,
ఇంటికి వెళ్ళాలనే తొందరలో నేను వడి వడిగా అడుగులు వేస్తున్నాను నా అవస్థ చూసి మేఘాలకి కూడా జాలేసినట్లుంది
అందుకేనేమో కన్నీరు కారుస్తుంది (వర్షం కురవటం మొదలయింది)....!
నేను అలా నడుస్తూనే ఉన్నాను, నా వెనకాల ఏదో అలికిడి వినిపిస్తుంది ఎవరో నాలాగ ఇంటికి వెళ్ళాలనే తొందరలో ఉన్నట్లున్నారు నేనేమి పట్టించుకోకుడా త్వరత్వరగా నడుస్తున్నాను.... 
ఇంతలో ఒక్కసారిగా  నా అవస్థకు  బాదపడుతూ  మెరుపులు మారోసారి రోధించాయి(మెరిసాయి), ఇంతలో ఒక అందమైన ఆకారం నన్ను దాటుకుంటూ వెళ్లిపోయింది... 
 అంత వరకు తెలియదు ఇంత సేపు నా వెనకాల నుండి నడుస్తున్నది ఒక అందమైన అమ్మాయి అని.... ఎర్రటి ఆ మెరుపులో,  ఎర్రటి నిండైన చీరలో తన  మొహాన్ని చూసాను.... దేవలోకం నుండి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది తన రూపం, ఆ కళ్ళైతే మరీను ఎంత సేపు చూసినా తనివితీరదేమో....
చూసిన క్షణం లోనే ఒక్కసారి ఆకాశపుటంచులదాక  అలా అలా తేలియాడి వచ్చాను...
తను వెళ్తూనే ఉంది నేను త్వరగా తేరుకుని తన  వెంటే వెళ్ళాను తనతో ఎలాగైనా మాట్లాడాలనిపించింది ఇక దైర్యం  చేసి తన పక్కకి వెళ్ళాను  అంత లోపే తను నా వైపు చూసింది ఆ కళ్ళల్లో ఏదైనా శక్తి దాగి ఉందేమో... ఒక్కసారిగా నా మనసును  తనవైపే లాగేసింది అదేదో గురుత్వాకర్షణ శక్తి లాగ....
తను ముందు నన్ను చూసి ఉలిక్కి(బయపడినా) పడినా, నా అవస్థ చూసి కళ్ళతోనే మట్లాడేసింది... 
"ఎం మాట్లాడాలో తెలీక మీతో నడవవచ్చా అని అడిగాను.... తను కాసేపు ఏదో ఆలోచించింది, తరువాత  చిరునవ్వు నవ్వి  నా చేతిని  అందుకోబోయింది......
అంతలోపే

అగ్ని పర్వతం నుండి పొంగుతున్న లావాను ఉప్పొంగిన సముద్రపు కెరటాలు ముంచేసినంత   ఫీలింగ్...
 చిన్నపాపలాగా గెంతుతూ తీరాన్ని తాకబోతున్న ఒక చిన్న అలను  తిమింగలం లాంటి ఒక పెద్ద అల మింగేసినట్లు.... 
నాకొచ్చిన ఒక అందమైన "కల"ను నా మెలకువ మింగేసింది.........
                                                                     -నందు

4 comments:

ఇందు August 9, 2011 at 7:41 AM

సూపర్బ్ చాలా బాగా రాసారు :)

నేనైతే అస్సలు కల అనుకోలేదు :))))

భలే ఉంది మీ కల!

నందు August 10, 2011 at 7:41 AM

ఒక అందమైన కలని కూడా ఉహించె రాసాను నిజమైన కలేమి కాదు...

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी August 10, 2011 at 8:17 AM

కలని మెలకువ మింగేస్తుంది :-)
బాగుందీ మాట.
బాగా రాశారండీ కలని.

నందు August 10, 2011 at 10:13 AM

మందాకినీ గారు ధన్యవాదములు...